ఇటీవల గూగుల్(Google Gemini) తీసుకొచ్చిన నానో బనానో(Nano Banana) ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫీచర్ అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వినియోగదారులు ఈ ఫీజర్తో తమకు నచ్చిన ఫొటోలను ఏఐ ఇమేజ్లోకి మార్చుకున్నారు.
అయితే తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి నానో బనానా ఏఐ టూల్ వాడి ఫేక్ లీవ్ను తీసుకోవడం చర్చనీయమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ ఉద్యోగి తన చేతి ఫొటోను తీసుకున్నాడు. ఆ చేతికి ఎలాంటి గాయాలు లేవు.
లీవ్ తీసుకోవాలని అనుకున్న ఆ ఉద్యోగి తన చేతి ఫొటోకు గాయమైన ఫొటో ఇవ్వాలని జెమినై నానోలో అడిగాడు. దీంతో సెకండ్లలోనే అతడి చేతికి గాయమైన AI జనరేటేడ్ ఫొటో వచ్చేసింది. దీన్ని తన కంపెనీ హెచ్ఆర్కు పంపించి తాను బైక్పై నుంచి పడిపోయానని చెప్పాడు. ట్రీట్మెంట్ అవసరమని తెలిపాడు. ఇదిచూసి బాధపడ్డ HR వెంటనే అతడికి పెయిడ్ లీవ్ ఇచ్చాడు. అయితే ఆ ఉద్యోగి ఏఐ ఫొటోను పంపించాడని ఆ హెచ్ టీమ్ కూడా గుర్తించలేకపోయింది.
ప్రస్తుతం ఏఐ వాడటం విపరీతంగా పెరిగిపోయింది. అనేకమంది ఏఐ ఫొటోలు, వీడియోలు జనరేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని చూస్తే కూడా నిజమే అని అనిపించేలా ఉంటున్నాయి. అయితే ఇలా ఉద్యోగులు, ఇతర వ్యక్తులు ఏఐని వాడి ఫేక్ గాయాలు, మెడికల్ రిపోర్టులు క్రియేట్ చేస్తే ఆయా సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

































