పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ జనరేషన్ వారికి ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ 90’s కిడ్స్ కు ఈమె ఫేవరెట్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళ్ ల్లో కథానాయికగా చేసింది.
స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ ల్లో యాక్ట్ చేసింది. అందం, అభినయ ప్రతిభతో ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు గెల్చుకుంది. లతో పాటు లవ్, డేటింగ్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలిచిందీ అందాల తార. స్టార్ హీరోలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ ప్రేమ వ్యవహారాలు కొనసాగించిందీ అందాల తార. అయితే ఏదీ పెళ్లిపీటల దాకా చేరుకోలేదు. చివరకు 2010లో ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కూడా ఎక్కువగా నిలవలేదు. పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇప్పుడీ బ్యూటీ వయసు సుమారు 55 ఏళ్లు. సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. కాగా కొన్నేళ్ల క్రితం ప్రమాదకర క్యాన్సర్ బారిన పడిందీ ముద్దుగుమ్మ. నాలుగు పదుల వయసులో ఈ మహమ్మారితో పోరాటమంటే మామూలు విషయం కాదు. కానీ ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ ను ఓడించి తన లాంటి ఎంతో మంది మహిళలకు ఆదర్శంఆ నిలిచింది.
ప్రస్తుతం లు, వెబ్ సిరీసుల్లో సహాయక నటిగా కనిపిస్తోన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా ఒక ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అయితే ఈసారి ఆమె డిఫరెంట్ లుక్ లో కనిపించడం వల్ల అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆమెనే చాలా యంగ్ లుక్ లో చూసిన జనాలు ఈసారి కాస్త ఓల్డ్ లుక్ లో చూసి గుర్తు పట్టలేకపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరైనా ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు మనీషా కొయిరాలా.
మనీషా కొయిరాల మరెవరో కాదు నేపాల్ మాజీ ప్రధాని బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలు. 1959-60 మధ్య నేపాల్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానమంత్రి గా చరిత్ర సృష్టించారు బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా. ఇక మనీషా తండ్రి ప్రకాశ్ కొయిరాలా కూడా 2005-06 మధ్య నేపాల్లో మంత్రిగా పనిచేశారు.



































