ఏపీలో మరోసారి కొలువుల జాతరకు వేళైంది. నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా జాబ్ క్యాలెండర్ విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవలే మెగా డీఎస్సీతో పోస్టుల భర్తీ చేసిన సర్కార్..
2026 జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. అన్ని శాఖల్లో కలిపి 30వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశాలున్నాయి. గ్రూప్ 1లో 250కి పైగా పోస్టులకు, గ్రూప్-2లో 2వేల 5 వందల పోస్టులతో పాటు.. గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్స్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియేట్ లెక్చరర్లు.. ఎలక్ట్రిసిటీ, సివిల్ ఇంజినీర్లు.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల్లో నియామకాలను చేపట్టనున్నట్టు తెలుస్తోంది.



































