శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వస్తుంటాయి. అమ్లా (ఉసిరి)లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
సజ్జలు జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. నెయ్యి జీవక్రియను పెంచి, పోషకాల శోషణకు సహాయపడుతుంది. చిలగడదుంపలు స్థిరమైన శక్తిని అందించి, శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. నువ్వులు ఎముకల ఆరోగ్యానికి, చర్మ ఆర్ద్రీకరణకు తోడ్పడతాయి. బెల్లం శరీరంలోని విషపదార్థాలను తొలగించి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

































