ప్రభుత్వ రంగ టెలికా సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరోసారి ఫ్రీడమ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.1 రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.
కేవలం ఒక్క రూపాయితో రీఛార్జ్ చేసుకుంటే చాలు, ఎన్నో బెనిఫిట్స్ అందిస్తోంది.
BSNL ప్రకటించిన ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా లభించే బెనిఫిట్స్ ఇవే!
రూ.1 రీఛార్జ్ ప్లాన్
– అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 30 రోజులు
– రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది
– రోజుకు 100 SMSలు ఉచితంగా పంపించుకోవచ్చు.
ఎప్పటి వరకు ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది?
BSNL యెక్క ఈ ఆఫర్ డిసెంబర్ 1- 31,2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్ ఎవరు పొందవచ్చు ?
BSNL యొక్క ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ కేవలం కొత్త బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో భాగంగా BSNL సిమ్ ఉచితంగా పొందవచ్చు. కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు సమీపంలోని BSNL సర్వీస్ సెంటర్ (CSC)ను లేదా రిటైలర్ను సంప్రదించవచ్చు.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం తాజాగా BiTV Premium Packను అందుబాటులోకి తెచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా OTT సబ్స్క్రిప్షన్లు, లైవ్ టీవీ ఛానెల్స్ ఉచితంగా పొందవచ్చు.
కేవలం రూ.61కే BSNL IFTV ప్రీమియమ్ ప్యాక్ ప్రవేశపెట్టింది.
అసలేంటి BSNL IFTV ?
BSNL IFTV అంటే ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అందించే సర్వీస్. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్ లైవ్ టీవీ ఛానెల్స్ చూడవచ్చు. సెట్-టాప్ బాక్స్ లేకుండానే అంతరాయం లేని, హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. FTTH (ఫైబర్-టు-ది-హోమ్) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో సులభంగా ఎంటర్టైన్మెంట్ ఎక్సపీరియెన్స్ పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ తమ యూజర్ల కోసం ఐఎఫ్టీవీ(BSNL IFTV) ప్రీమియమ్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.61 రీఛార్జ్‌తో 1000కి పైగా ఛానెల్స్ అందిస్తుంది. స్టాటర్ ప్లే ప్లాన్ పేరుతో రూ.61 రీఛార్జ్ ప్లాన్, రూ.151తో లైట్ ప్లే హెచ్డీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
































