ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఎవరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధాప్యం బాధపడుతున్న వారికి,భర్తలేని వితంతువులకు, అనారోగ్యంతో బాధపడే వారికి కొండంత అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ స్కీంను అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్‌ను పెంచిన సంగతి తెలిసిందే. ఏపీలో’ఎన్టీఆర్ భరోసా పింఛన్’ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, నేత కార్మికులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి పింఛన్ అందుతుంది. ప్రతి నెలా ఒకటోతారీఖునే రూ.4వేల నుంచి రూ.15వేల ఆర్థిక సాయం పింఛన్ రూపంలో అందిస్తోంది ప్రభుత్వం. లబ్ధిదారులు ఎక్కడకి వెళ్లనవసరం లేకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తోంది. ఒక్కో సందర్భంలో ఒక్కరోజు ముందుగానే పింఛన్ అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం.అయితే కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇలా చేస్తే పింఛన్ రావడం ఖాయం
కొత్త పింఛన్ కోసం ఇలా చేయండి
అన్ని అర్హతులు కలిగి ఉండే పెన్షన్ అందుకోలేని అభాగ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నెలకు రూ. 4,000 నుంచి రూ. 15,000 వరకు ఆర్థిక సాయం అందించబడుతున్న నేపథ్యంలో అర్హత కలిగిన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే దరఖాస్తు దారుడు అదే రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నింటికి అర్హత కలిగితేనే పింఛన్ అందజేస్తోంది ప్రభుత్వం.
పింఛన్ పొందేందుకు అర్హతులు ఇవే
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు
ఇంట్లో ఆదాయ పన్ను చెల్లించే సభ్యులు ఉండకూడదు
కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి లేదా 10 ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి
కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 లోపు ఉండాలి
కుటుంబానికి టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహా ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు.
కరెంటు వినియోగం ప్రతి నెలా 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం
అర్హులైన లబ్ధిదారులు ఈ పథకానికి ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ విధానం
అర్హతలు కలిగిన దరఖాస్తు దారుడు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి
దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన పత్రాలను జతచేసి సచివాలయంలో సంబంధిత అధికారికి అందజేయాలి
కొన్ని ప్రత్యేక పింఛన్లకు (ART, CKDU, సైనిక్ సంక్షేమం, అభయహస్తం)సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ విధానం
అర్హత కలిగిన వారు మీ సేవా/గ్రామ సచివాలయం పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ https://sspensions.ap.gov.in లోకి వెళ్లి, లాగిన్ అయ్యి, అవసరమైన వివరాలు నమోదు చేసి, పత్రాలను అప్లోడ్ చేసి ‘SUBMIT’ చేయాలి.
దరఖాస్తుకు కావలసిన ప్రధాన పత్రాలు
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
వితంతువులు: భర్త మరణ ధృవీకరణ పత్రం.
వికలాంగులు: సదరం ధృవీకరణ పత్రం.
ఒంటరి మహిళలు: తహసీల్దార్ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం.
కార్మికులు (గీత/నేత/మత్స్య/చర్మకారులు): సంబంధిత శాఖల ధృవీకరణ పత్రాలు.
ట్రాన్స్జెండర్లు: వైద్య శాఖ ధృవీకరణ పత్రం.
దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి లేదా ఫిర్యాదుల కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా హెల్ప్‌లైన్ నంబర్ 0866-2410017కు కాల్ చేయవచ్చు.
డిసెంబర్ నెలలో 8190 మందికి కొత్తగా పింఛన్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం క్రింద డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న వాతావరణం సహకరించకపోయినప్పటికీ మంత్రలు, ఎమ్మెల్యేలు, ఇతర సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నారు.ఈ నెలకు సంబంధించి 63,25,999 మంది లబ్దిదారులకు రూ 2738.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేసింది.ఈ నెలలో కొత్తగా 8190 పింఛన్ అందుకోనున్నారు.ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.21280 కోట్లు పెన్షన్ల క్రింద లబ్ధిదారులకు అందజేసింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ సొమ్మును పెంచడమే కాదు అర్హులైన వారందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తోంది. ఈనెలలో కొత్తగా 8190 మందికి కొత్త పింఛన్ అందిస్తోంది. ఇటీవలే పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే ఆ పింఛన్‌ను స్పౌజ్ కోటాలో భార్యకు అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.ఈ స్పౌజ్ కేటగిరీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 90 వేల మందికి పెన్షన్ అందిస్తోంది.



































