మనం ఏదైనా శుభం లేదా ఆ శుభం మాట్లాడినప్పుడు కొందరు పెద్దలు వారిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెడు మాట్లాడినప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే..
పైన తథాస్తు దేవతలు ఉంటారు.. అలా అనొద్దు అని చెబుతారు. వాస్తవానికి మనం అనుకున్నవన్నీ జరగవు అని.. అలాంటప్పుడు తథాస్తు దేవతలు ఎలా వింటారు? అన్న సందేహం చాలామందికి వస్తుంది. కానీ పురాణాల ప్రకారం తథాస్తు కచ్చితంగా తిరుగుతూ ఉంటారు. వారు ఒక ప్రత్యేకమైన సమయంలో తిరుగుతూ మానవులు చెప్పే కొన్ని మాటలకు తథాస్తు అని అనుకుంటూ వెళ్తారు. వారు అలా వన్ అనగానే అవి జరిగిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఎవరు ఈ తథాస్తు దేవతలు? వీళ్లు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు?
తథ అంటే ఆ విధంగా.. అస్తు అంటే జరుగుగాక.. తథాస్తు అంటే అనుకున్న పని జరగాలని దేవుళ్ళు కోరుకుంటారు. తథాస్తు అనే దేవతలు ప్రత్యేకంగా ఉంటారు. వీరినే అశ్విని కుమారులు అని అంటారు. వేడి తట్టుకోలేక సూర్య దేవుడి భార్య అయినా సంధ్యాదేవి గుర్రం రూపం దాల్చి గురుదేశం వెళ్తుంది. అయితే సూర్యదేవుడు కూడా గుర్రం రూపం మార్చుకొని గురుదేశం వెళ్తాడు. ఇక్కడ వీరిద్దరి కలయిక వల్ల అశ్విని కుమారులు జన్మిస్తారు. వీరినే తథాస్తుదేవతలు అని అంటారు. వీరు ఒక చేత ఆయుర్వేద ని చూపిస్తూ మరో చేత మంత్రాలని జపిస్తూ తిరుగుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ మంచి కావాలనే కోరుకుంటూ ఉంటారు. అందుకే యజ్ఞాలు, పూజలు నిర్వహించే చోట ఎక్కువ సమయం గడుపుతారు
తథాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు తిరుగుతూ ఉంటారు. మీరు అతివేగంగా తిరుగుతూనే మనుషులు అనే మాటలను వింటూ ఉంటారు. అయితే వారికి వినిపించిన మాటలను తథాస్తు అని అనగానే వెంటనే జరిగిపోతుంది. అయితే ఈ సమయంలో ఏదైనా కోరుకుంటే జరిగిపోతుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఇదే సమయంలో చెడు మాట్లాడకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే తథాస్తు దేవతలకు మంచి కోరుకునే వారు అంటే చాలా ఇష్టం. అందుకే వారు మాట్లాడే ప్రతి మాటను గమనిస్తూ ఉంటారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటూ ఉంటారు. అందువల్ల మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని అంటూ ఉంటారు. మాటతోనే మనుషుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఒక మాటతో ఎంతో కాలం కలిసి ఉన్న బంధాలు కూడా చెడిపోతాయి.
తథాస్తు దేవతల అనుగ్రహం ఉండాలంటే ఎప్పటికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇతరులకు కూడా హాని చేయకుండా మెలగాలి. అప్పుడే వారి జీవితం సంతోషంగా సుఖమయంగా సాగుతూ ఉంటుంది.



































