సమంత ఇటీవలే దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుని కోయంబత్తూర్ లోని ఇషా ఆశ్రమంలో పెళ్లి చేసుకుంది. గత నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు ఈ జంట అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఈ పెళ్లి తో ఆ రూమర్స్ నిజమే అని చెప్పేసారు సమంత – రాజ్.(Samantha)
సమంత – రాజ్ పెళ్లి ఫోటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తన భర్త ఫ్యామిలీతో దిగిన ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు ఈ ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసింది.
శీతల్ నిడిమోరు షేర్ చేసిన ఈ ఫ్యామిలీ ఫొటోలో.. సమంత, తన భర్త రాజ్ నిడిమోరు, రాజ్ నిడిమోరు తల్లి తండ్రులు, రాజ్ సోదరి శీతల్, శీత ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ఫొటోలో శీతల్ భర్త లేకపోవడం గమనార్హం. సమంత కొత్త ఫ్యామిలీ ఇదే అంటూ ఈ ఫోటోని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
ఇక శీతల్ ఈ పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ఇషాలో శివుడి ఆధ్వర్యంలో పెళ్లి జరగడం ఆనందంగా ఉంది అంటూ ఆ ఆశ్రమం గురించి రాసుకొచ్చింది. దీనికి సమంత లవ్ యు అంటూ రిప్లై ఇచ్చింది.

































