త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. శ్రీకాంతాచారి బలిదానం కూడా అదేరోజు జరిగినట్లు గుర్తుచేశారు. ఆయన స్పూర్తితోనే 60 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండన్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.