అత్తర్ మంచి సువానలను వెదజల్లుతుంది. అయితే కొంత మందికి ఇదంటే ఎక్కువ ఇష్టం ఉంటే, కొందరు దీనిని ఎక్కువగా ఇష్టపడరు. కానీ దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పండితులు.
దీని వలన వాస్తు దోషాలు తొలిగిపోయి, ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుందంట.
గంధపు అత్తర్ : గంధపు అత్తర్ అనేది స్వచ్ఛతను, ఆధ్యాత్మిక సమతుల్యతను సూచిస్తుంది. దీనిని ప్రార్థనా మందిరంలో చల్లడం వలన ఇంటిలో ప్రశాంతకర వాతావరణం ఏర్పడుతుంది. అంతే కాకుండా పూజ సమయంలో ఇది ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది.
రోజ్ అత్తర్ : ఇది ప్రేమ, కరుణ స్వచ్ఛతను సూచిస్తుంది. లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది అని అంటారు. ఇక ఈ రోజ్ అత్తర్‌ను ఇంటి లోపల బెడ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లలో చల్లుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందంట.
జాస్మిన్ అత్తర్ : జాస్మిన్ అత్తర్ సువాన చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీనిని ఇంటిలో చల్లుకోవడం వలన ఇది అదృష్టాన్ని తీసుకరావడమే కాకుండా, అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే ఈ సువాసన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
అయితే అత్తర్‌ను ఉపయోగించడానికి కూడా కొన్ని వాస్తు నియమాలు పాటిచాలంట. అత్తర్‌ను ఈశాన్యంలో లేదా బ్రహ్మ స్థానంలో చల్లడం వలన ఇది దైవశక్తిని ఆకర్షించడమే కాకుండా, స్వచ్ఛత, ఆనందాన్ని అందిస్తుందంట. అలాగే, దీనిని గోడలపై నేరుగా కాకుండా, నీటిలో రెండు మూడు చుక్కలు కలిపి చల్లుకోవడం చాలా శ్రేయస్కరం.



































