జామ.. పండ్ల జాతి రకం మొక్క. జామ పండ్లు మాత్రమే కాదు జామ ఆకులు కూడా తినొచ్చు. జామ ఆకులు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో కూడా జామ ఆకులు ఒక కీలక భూమిక పోషిస్తున్నాయి.
వీటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి మేలు చేస్తాయి. ఇక ఇదే విషయాన్ని అనేక పరిశోధనలు సైతం ధ్రువీకరించాయి.
జామ ఆకులతో జీర్ణ వ్యవస్థకు మేలు
జామ ఆకుల్లో ఉండే పోషకాలు, యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనలో రోగ నిరోధక శక్తిని పెంపు చేస్తాయి. పేగులలో ఉన్న చెడు బ్యాక్టీరియాతో పోరాడి కడుపుబ్బరం, అతిసారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇక జామ ఆకుల్లో ఉండే క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి
డయాబెటిస్ కు, గుండె జబ్బులకు బెస్ట్
జామ ఆకులు శరీరంలో గ్లూకోజ్ శోషణ ను క్రమబద్ధీకరించి టైప్ టు డయాబెటిస్ తో బాధపడే వారికి, ప్రీ డయాబెటిస్ తో బాధపడే వారికి మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా రెండు జామాకులను తింటే మన శరీరంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక జామ ఆకులు చర్మ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి.
జామ ఆకులతో బరువుకు చెక్
జామ ఆకులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన చర్మానికి సహజ మెరుపుని ఇస్తాయి. మొటిమలు రాకుండా నివారిస్తాయి. నోటి పూత, అల్సర్ల సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తాయి. నోటి పరిశుభ్రతకు కూడా ఉపయోగపడతాయి. జామ ఆకులను తిన్నట్లయితే మహిళలలో రుతుస్రావం నొప్పి కాస్త తగ్గుతుంది. అంతే కాదు జామాకులు బరువు నియంత్రణకు దోహదం చేస్తాయి.
జామ ఆకులను వాడాలంటే జాగ్రత్త
మనం తీసుకునే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు షుగర్స్ గా మారకుండా నిరోధించడానికి ఇవి దోహదం చేస్తాయి. అయితే క్రమం తప్పకుండా ఒక రెండు జామాకులను మాత్రం తీసుకుంటే సరిపోతుంది. అధిక మోతాదులో దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల ఒక్కోసారి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కనుక జామాకులను ప్రతిరోజు వాడాలనుకునే వారు ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మొదలు పెట్టండి.































