మేడమ్ సార్, మేడమ్ అంతే! వెయిట్‌లిఫ్టింగ్‌లో అద్భుత ‘ప్రగతి’! ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన తెలుగు నటి…

‘బాద్‌షా’, ‘రేసు గుర్రం’, ‘ఇద్దరు అమ్మాయిలతో’ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన నటి ప్రగతి, పవర్ వెయిట్‌లిఫ్టింగ్‌లో వరుస పతకాలు సాధిస్తూ సత్తా చాటుతోంది.


ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించిన ప్రగతి, ప్రస్తుతం టర్కీలో ఏషియన్ గేమ్స్‌లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచిన ప్రగతి, సిల్వర్ మెడల్ సాధించింది..

సౌత్ ఇండియన్ ఛాంపియన్‌షిప్ 2024 పోటీల్లో సిల్వర్ మెడల్ గెలిచిన ప్రగతి, ఈ ఏడాది కేరళలో జరిగి నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ 2025 పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది దాదాపు 50 ఏళ్లకు చేరువైన ప్రగతి, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది..

సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత సీరియల్స్‌లో రీఎంట్రీ ఇచ్చిన ప్రగతి, మెల్లిమెల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి.. దాదాపు 200 సినిమాల దాకా నటించింది.. సినిమాల్లో హీరో, హీరోయిన్ తల్లిగా, వదినగా, అక్కగా చాలా పాత్రల్లో నటించిన ప్రగతి, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి, అభిమానులకు షాక్ ఇచ్చేది.

చిన్నతనంలోనే ప్రేమ పెళ్లి చేసుకుని, హీరోయిన్‌గా కెరీర్‌ని పాడుచేసుకున్న ప్రగతి, ఆర్థిక ఇబ్బందులు, సంసారంలో ఒడుదుడుకులు ఎదుర్కొన్న తర్వాత తాను చెప్పిన తప్పు తెలుసుకుని… మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. ఆత్మగౌరవం ఎక్కువగా ఉండడం వల్ల చిన్నతనం నుంచే కష్టపడడం అలవాటు చేసుకున్నానని, పాకెట్ మనీ కోసం అమ్మను అడగకుండా ఎస్టీడీ బూతుల్లో, పిజ్జా హట్ వంటి స్టోర్లలో పని చేశానని కూడా చెప్పుకొచ్చింది ప్రగతి.

49 ఏళ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలవడం అంటే మామూలు విషయం కాదు… సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే, ప్రగతి ఈ టాలెంట్‌ని సినిమాల్లో కూడా చూపించే అవకాశం దక్కుతుందేమో చూడాలి.. సరైన దర్శకుడి చేతిలో పడితే, ప్రగతి బయోపిక్ కూడా మంచి బ్లాక్ బస్టర్ సబ్జెక్ట్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.