గతంలో ఉన్న మెట్రో టైమింగ్స్ పూర్తిగా మార్చేశారు. వారంలో అన్ని రోజులు ఉదయం 6 గంటలకు నుంచి రాత్రి 11 గంటలకు మెట్రో సర్వీసులు నడుస్తాయి. అంటే శని, ఆదివారాల్లో కూడా సేమ్ టైమింగ్‌లోనే సర్వీసులు నడుస్తున్నాయి.
ఈ మార్పులు నవంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చాయి. మరి పాత టైమింగ్స్ ఎలా ఉండేవని అనుకుంటున్నారా.?
సోమవారం నుంచి శుక్రవారం వరకు: మొదటి మెట్రో ఉదయం 6 గంటలకు, చివరి రైలు దాదాపు 11:45 వరకు నడుస్తూ ఉండేది.
శనివారం: ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వీసులు ఉండేవి.
ఆదివారం: మొదటి మెట్రో ఉదయం 7 గంటలకు, చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండేది.
ఈ కాంబినేషన్ వల్ల వర్కింగ్ డేస్‌లో లేట్ అవర్స్ ప్రయాణానికి సౌలభ్యం ఉన్నా, ఆదివారం మొదటి రైలు ఆలస్యంగా ఉండటం, టైమింగ్స్ రోజు వారీగా మారడం వల్ల కన్‌ఫ్యూజన్ ఉండేది. దీంతో హైదరాబాద్‌లో తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు లాంటి ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఈ నేపధ్యంలో మెట్రో అధికారులు వారం రోజులు మెట్రో సర్వీసులు ఒకే టైమింగ్స్‌లో నడపాలని నిర్ణయించారు.
ఇకపై వారంలో అన్ని రోజులు మెట్రో సర్వీసులు ఒకే టైమింగ్‌లో నడుస్తాయి. అన్ని రోజులు(సోమవారం నుంచి ఆదివారం) మెట్రో సర్వీస్ అవర్స్ ఉదయం 6:00 నుంచి రాత్రి 11:00 వరకు ఉండేలా ఫిక్స్ చేశారు. మొదటి రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6:00కి బయల్దేరితే.. చివరి రైలు అన్ని టెర్మినల్స్ నుంచి రాత్రి 11:00కి డిపార్ట్ అవుతుంది. దీంతో వీకెండ్‌లో నడిచే రాత్రి 11:45 గంటలకు చివరి రైలు ఇక కట్ అయినట్టే. ఇకపై ఎప్పటిలానే చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు క్లోజ్ కానుంది. ప్రయాణికుల సౌలభ్యం, డిమాండ్‌ను బట్టి సర్వీసులను స్టాండర్డ్ టైమ్‌స్లాట్‌లో కుదించే స్ట్రాటజీగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రోజూ ఒకే టైమింగ్ ఉండటం వల్ల ఆఫీస్ వర్కర్లు, స్టూడెంట్స్, ఇతర ప్రయాణికులు తమ రొటీన్‌ను ప్లాన్ చేయడం సులభం అవుతుందని.. ప్రత్యేకించి ఆదివారం ఉదయం 7 నుంచి 6 గంటలకు మార్చడం వల్ల ఎర్లీ మార్నింగ్ ట్రావెలర్లకు కంఫర్ట్ పెరుగుతుందని మెట్రో సంస్థ భావిస్తోంది. ఫ్రీక్వెన్సీ పరంగా పీక్ అవర్స్(ఉదయం 8-11, సాయంత్రం 5-8)లో ఎక్కువ ట్రైన్లు, మిగతా సమయాల్లో 5-12 నిమిషాల గ్యాప్‌తో సర్వీసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.



































