క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సిమ్లాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సాధారణంగా ఈ సీజన్లో హోటల్ ఛార్జీలు, క్యాబ్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు, ప్రయాణాన్ని పూర్తిగా సౌకర్యవంతంగా చేస్తుంది. మీకు వసతి, ఆహారం, స్థానిక ప్రయాణం వంటి సమస్యలేమీ ఉండవు.
కవర్ అయ్యే ప్రదేశాలు
‘కొండల రాణి’గా పిలిచే సిమ్లా హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక నగరం. పర్వతాలు, అడవులు, దివ్యమైన దేవాలయాలు మనసును కట్టిపడేస్తాయి. ఈ ప్యాకేజీ పేరు సిమ్లా–హతు మందిర్–నర్కండ–చండీగఢ్ (NCH38). మీరు సిమ్లా, కుఫ్రి, నర్కండలోని హతు దేవాలయాన్ని సందర్శిస్తారు.
తేదీలు, బుకింగ్
- మొత్తం ట్రిప్ 3 రాత్రులు, 4 పగళ్లు.
- ప్యాకేజీ తేదీలు: డిసెంబర్ 22, 2025 నుంచి జనవరి 2, 2026 వరకు.
- క్రిస్మస్ (డిసెంబర్ 25), న్యూఇయర్ తేదీలకు ట్రిప్ స్టార్ట్ కాదు.
- మిగిలిన రోజుల్లో రోజువారీ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణ కార్యక్రమం ఎలా ఉంటుంది?
- మొదటి రోజు మిమ్మల్ని చండీగఢ్ రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం నుండి సాయంత్రం మాల్ రోడ్ సమీపంలోని హోటల్ వద్ద దింపుతారు.
- రెండవ రోజు అల్పాహారం తర్వాత, నర్కండలోని హతు ఆలయానికి వెళ్లి, అక్కడ నుండి కుఫ్రి(రిసార్ట్ హిల్ స్టేషన్)కు వెళ్ళి సాయంత్రం, మాల్ రోడ్‌ను సందర్శించి హోటల్లో చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది.
- మూడవ రోజు అల్పాహారం తర్వాత జఖు ఆలయం, హనుమాన్ ఆలయం, బౌద్ధ ఆరామం, పంథాఘటికి వెళ్లి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
- నాలుగవ రోజు అల్పాహారం తర్వాత తిరుగు ప్రయాణం చేస్తారు.
ప్యాకేజీ ధరలు
ఎటియోస్/ఇండిగో/డిజైర్ లేదా అలాంటి వాహనంలో ప్రయాణించడానికి ధర.
ఒక వ్యక్తి ప్యాకేజీ: రూ. 34,880
ఇద్దరికీ (డబుల్ షేరింగ్): వ్యక్తికి రూ. 19,330
ముగ్గురికి: వ్యక్తికి రూ. 15,160
5–11 ఏళ్ల పిల్లలు (అదనపు బెడ్): రూ. 11,280
5–11 ఏళ్ల పిల్లలు (బెడ్ లేకుండా): రూ. 10,140
ఇన్నోవా / టవేరా మొదలైన వాటి ధర
వ్యక్తికి ప్యాకేజీ రూ. 22970
ఇద్దరికీ రూ. 16,360
ముగ్గురికి రూ. 15,160
5-11 సంవత్సరాల పిల్లల అదనపు బెడ్: 12,770
5–11 ఏళ్ల పిల్లలు (బెడ్ లేకుండా): రూ. 11,630
మీరు ఈ ప్యాకేజీని తీసుకోవాలనుకుంటే, ఆన్లైన్లో www.irctctourism.com వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇది సాధారణ సమాచారం మాత్రమే.. మిగిలిన వివరాలను మీరు IRCTC వెబ్సైట్లో కనుగొనవచ్చు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. )































