మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు.
ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. నేడు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు ఓ వీడియోను షేర్ చేశారు మూవీటీమ్.
అందులో.. ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేష్.. హ్యాపీ బర్త్‌డే వెంకటేష్ గారు’ అంటూ అనిల్ రావిపూడి చేసిన వీడియో క్రేజీగా ఉంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే విక్టరీ వెంకటేష్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. వెనక హెలికాఫ్టర్ ఆగి ఉంటే అతని వెనక గన్ మెన్స్ నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది.


































