ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. ఒక్క రోజు ముందే.. రెడీగా ఉండండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది.


లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 2026 పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. జనవరి నెల పింఛన్‌ను జనవరి ఒకటో తేదీ కాకుండా ఒకరోజు ముందుగానే అంటే.. డిసెంబర్ 31వ తేదీనే అందించనున్నట్లు సమాచారం.

జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7:00 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పింఛన్ మొత్తా్న్ని అందించనున్నట్లు సమాచారం. జనవరి ఒకటో తేదీ సెలవు నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మరోవైపు గతేడాది కూడా ఇలాగే మార్పులు చేశారు. జనవరి నెల పింఛన్‌ను డిసెంబర్ 31వ తేదీనే అందించారు. అలాగే ఏవైనా సెలవు రోజులు వంటి పరిస్థితులు వస్తే.. ఆయా పరిస్ధితులకు అనుగుణంగా పింఛన్ల పంపిణీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా 2026 జనవరి పింఛన్లను ఒకరోజు ముందే అందించనున్నట్లు సమాచారం.

మరోవైపు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు అందిస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు , పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి 15 వేల రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలకు పది వేల రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నారు.

గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందించేవారు. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం మార్చారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.