డిసెంబర్ 16వ తేదీ, మంగళవారం బంగారం ధరలు ఇవే… కొత్త రికార్డును సృష్టించిన పసిడి ధర…

నేడు డిసెంబర్ 16వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,070 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.


1,23,900 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,98,000 పలుకుతోంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పెరిగింది. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ బంగారం ధర నూతన గరిష్ట స్థాయిని తాకింది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికాలోని కమోడిటీ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర 4350 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. గతంలో అక్టోబర్ 20వ తేదీన బంగారం ధర చివరి సారిగా 4395 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డును తాకింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి దిశగా అడుగులు వేస్తోంది.

బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ భారీగా పతనం అవడం ఒక కారణంగా చెబుతున్నారు. డాలర్ విలువ పతనం అయ్యే కొద్ది బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో డాలర్ బలహీన పడినట్లు గమనించవచ్చు ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి తొలగించి అధిక రాబడి ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి సాధనం బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం డిమాండ్ భారీగా పెరిగి ధరలు చుక్కలను తాకుతున్నాయి. బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 లో బంగారం ధర 5 వేల డాలర్లు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే బంగారం ధర భారీగా పెరగడం గమనించవచ్చు. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాల ధరలు మరింత భారీగా పెరిగాయి అని చెప్పవచ్చు.

ఇక మరో వైపు వెండి ధర కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకుని వెళ్తోంది. వెండి ఒక కేజీ రెండు లక్షల రూపాయలు సమీపంలో ట్రేడ్ అవుతోంది. వెండి ధర సరికొత్త రికార్డులను సృష్టించడానికి ప్రధానంగా మార్కెట్లో ఉన్న డిమాండ్ అని పేర్కొంటున్నారు. గ్రీన్ ఎనర్జీ డిమాండ్ కారణంగా వెండి కొనుగోలు చేసేందుకు ఇండస్ట్రీస్ ఎక్కువగా వెతుకుతున్నాయి. ఫలితంగా సిల్వర్ ధర భారీగా పెరగడం గమనించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.