టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం నటుడు గానే కాదు.. రాజకీయవేత్తగాను ఆయన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగి సక్సెస్ బాటలో దూపుకుపోతుంది.
మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. మళ్ళీ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తన సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా.. రిలీజ్ అయిన ఓజి సినిమా పవన్ స్టామినా ఏంటో.. మరోసారి వెండి తెరకు చూపించింది. ఇప్పటివరకు.. రూ.200 కోట్ల క్లబ్ కూడా దాటని పవన్ కు.. రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరే అదుర్స్ కంటెంట్ ఓజి ఇచ్చింది. ఈ క్రమంలోనే పవన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో విషయంలో ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.
ఇక పవన్‌ను ఎలా చూపించాలో హరీష్ శంకర్ కు తెలిసినంతగా మరొక డైరెక్టర్ కు తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చినా గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. సినిమాను కోలీవుడ్ మూవీ.. విజయ్, అట్లి కాంబోలో వచ్చిన తేరి రీమేక్‌గా తీజ్తున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనిపై హరీష్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సరికదా.. ఈ సినిమాకు దశరథ్ స్క్రీన్ ప్లే అందించడం ఆడియన్స్‌లో మరింత హైప్‌ను క్రియేట్ చేస్తుంది.
అసలు స్టోరీ ఏమీ ఉంటుందని టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక.. గత కొద్ది రోజులుగా పవన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. సడన్గా.. ఈ ఛేంజ్‌కు కారణమేంటి,, అసలు ఆ హెయిర్ స్టైల్ వెనకున్న రహస్యం ఏంటనే సందేహాలు కూడా ఆడియన్స్ లో మొదలయ్యాయి. ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడని.. పోలీస్‌కు ఓ సపరేట్ కోడ్ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే.. షార్ట్ హెయిర్ తో పవన్ కనిపించనున్నాడని.. అందుకే హెయిర్ స్టైల్ లో మార్చాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుజిత్ కు కార్ గిఫ్ట్ ఇస్తున్న టైం లోను.. అలాగే పొలిటికల్ మీటింగ్స్ లోను ఆయన అదే హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చారు. ఇక.. విజయ్ నటించిన తేరీ సినిమాలోను ఆయన హెయిర్ స్టైల్ ఇలానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ హెయిర్ స్టైల్‌ను గుర్తు చేసుకుంటూ వస్తాది భగత్ సింగ్ కోసమే పవన్ హెయిర్ స్టైల్ ఇలా చేంజ్ చేశారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

































