డిసెంబర్ 25, 2025 గురువారం క్రిస్మస్ పండుగకు ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 8 రోజులు వరుస సెలవులు రానున్నట్లు తెలుస్తుంది. ఇదే గనక జరిగితే విద్యార్థులకు ఇది గెంతులేసే వార్త అనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు శుభవార్త. ఈ సంవత్సరం డిసెంబర్ 25 (గురువారం)న క్రిస్మస్ వస్తున్నందున, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా పాఠశాలలు 2025 క్రిస్మస్ సెలవుల షెడ్యూల్ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాలలోని క్రైస్తవ మైనారిటీ పాఠశాలలు పొడిగించిన క్రిస్మస్ సెలవులను ప్రకటించే అవకాశం ఉంది. అంటే, డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 28, 2025 వరకు మొత్తం 8 రోజులు సెలవులొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, అధికారికంగా ఇంక ప్రకటించనప్పటికీ, పూర్తిగా నమ్మడానికి లేదు. తేదీలను నిర్ధారించే అధికారిక సర్క్యులర్ త్వరలో వస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలు- విద్యార్థులకు సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం కేవలం డిసెంబర్ 25వ తేదీన మాత్రమే సెలవు ఉండే అవకాశం ఉంది.
ప్రైవేట్ నాన్-మైనారిటీ పాఠశాలలు- ప్రాథమికంగా కేవలం షెడ్యూల్ ప్రకారం క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఒకవేల, నిర్వహణలు వేరే విధంగా నిర్ణయిస్తే మాత్రం మార్పులు ఉండే అవకాశం ఉంది.
సెలవులు ఎక్కడ, ఎవరికి ఎన్ని రోజులు ఇవ్వాలి అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఇప్పుడే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. సెలవుల తేదీలు నిర్ణయించిన తరువాత, ప్రతీ స్కూల్, కాలేజీకి అధికారికంగా సర్కులర్, నోటీస్ లేదా డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారంగా, సమాచారం త్వరలోనే చేరుతుంది.


































