జీవనశైలిలో వస్తున్న మార్పులతోపాటు వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి.
ముఖ్యంగా కొంతమందిలో తెల్ల జుట్టు విపరీతంగా పెరిగి గడ్డంతో పాటు తలపై జుట్టు కూడా పూర్తిగా దెబ్బతింటుంది. మరికొంతమందిలో తెల్ల జుట్టుతో పాటు బట్ట తల వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే, ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలామంది ఎన్నో రకాల షాంపులతో పాటు రెమిడిలను వినియోగిస్తున్నారు. కొంతమంది ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటున్నారు. అయినప్పటికీ, ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే, మీరు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతుంటే ఎలాంటి ఖరీదైన రెమెడీలతోపాటు రసాయనాల తో కూడిన ప్రోడక్ట్లను వినియోగించిన అక్కర్లేదు. ఎలాంటి దృశ్య ప్రభావాలు లేకుండా తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చుకోవడానికి అద్భుతమైన ఓ రెమిడీ మీకు పరిచయం చెయ్యబోతున్నాం.
వంటింట్లో తయారు చేసే ఆహార పదార్థాల్లో తప్పకుండా టమాటో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. టమాటో లేని ఆహారాలు అంతగా రుచిగా ఉండవు. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్నింట్లలో టమాటాను వినియోగిస్తూ ఉంటారు. టమాటోలు శరీరానికి అవసరమైన విటమిన్ కేతో పాటు పుష్కలంగా విటమిన్ సి, ఎ లు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ టమాటాతో తయారు చేసిన రెమెడీని జుట్టుకు వినియోగించడం వల్ల మంచి పోషణ అంది ఎంతో సులభంగా తెల్ల జుట్టు నుంచి విముక్తి కలుగుతుందని కొంతమంది సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
టమాటో వల్ల జుట్టుతో పాటు చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని, దీనిని మొటిమలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వినియోగించవచ్చని వారు అంటున్నారు. నిజానికి టమాటో రసంలో ఖనిజాలతో పాటు పుష్కలమైన విటమిన్సు లభిస్తాయి. దీనిని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు పొడవుగా మారడమే కాకుండా.. దృఢంగా, మెరిసేలా తయారవుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు తో పాటు ఇతర జుట్టు సమస్యలను కూడా ఎంతో సులభంగా నివారిస్తుంది. అలాగే గోరింటాకు జుట్టుకు పట్టించి.. ఆ తర్వాత టమాటో రసాన్ని అప్లై చేయడం వల్ల కూడా కొద్ది నిమిషాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ టమాటో రెమిడీని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం..
ఈ టమాటో రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక సగం టమాటో తో పాటు మూడు నుంచి నాలుగు చెంచాల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, కుదిరితే గోరింటాకు పేస్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటిని ఒక చిన్న గిన్నెలో వేసుకుని వాటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కనపెట్టి.. మంచి బ్రష్ ను వినియోగించి జుట్టుకు పట్టించండి.. ఇలా జుట్టుకు పట్టించిన తర్వాత దాదాపు 15 నిమిషాలు అలాగే ఉంచి.. గోరువెచ్చని నీటి తీసుకొని సాధారణ షాంపును వినియోగించి బాగా శుభ్రం చేసుకోండి. అయితే, ఇలా ప్రతినెలా చేస్తే నిమిషాల్లోనే జుట్టు నల్లగా మారిపోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన రెమిడిని కొంతమంది సౌందర్యాన్ని పనుల నుంచి సేకరించింది మాత్రమే.. దీనిని వినియోగించే ముందు తప్పకుండా సౌందర్య నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది.

































