కేవలం 4 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు.. కోటి రూపాయలు మీ సొంతం

దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్‌ఐసీ (LIC), కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎన్నో ప్లాన్లను అందిస్తోంది. అందులో కొన్ని ప్లాన్లలో కేవలం కొద్ది సంవత్సరాలు పెట్టుబడి పెడితే చాలు, గడువు ముగిశాక భారీ మొత్తంలో డబ్బు అందుకోవచ్చు.


అటువంటి ప్లాన్లలో ఒకటే జీవన్ శిరోమణి (Jeevan Shiromani) పథకం.

కోటి రూపాయల అష్యూరెన్స్ గ్యారెంటీ: జీవన్ శిరోమణి ప్లాన్ కింద కనీసం ఒక కోటి రూపాయల సమ్ అష్యూర్డ్ (Sum Assured) గ్యారెంటీ ఇవ్వబడుతుంది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. ఇది స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేని ఒక సేవింగ్ స్కీమ్ మరియు వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో నాలుగు ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నెలకు సుమారు 94,000 రూపాయల చొప్పున 4 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే, కోటి రూపాయల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి చెల్లించవచ్చు.

పాలసీ తీసుకునేందుకు వయస్సు ఎంత ఉండాలి?

  • కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
  • 14 ఏళ్ల పాలసీ టర్మ్: గరిష్ట వయస్సు 55 ఏళ్లు.
  • 16 ఏళ్ల పాలసీ టర్మ్: గరిష్ట వయస్సు 51 ఏళ్లు.
  • 18 ఏళ్ల పాలసీ టర్మ్: గరిష్ట వయస్సు 48 ఏళ్లు.
  • 20 ఏళ్ల పాలసీ టర్మ్: గరిష్ట వయస్సు 45 ఏళ్లు.

మనీ బ్యాక్ ప్రయోజనాలు: ఈ ప్లాన్ కింద నిర్ణీత కాల వ్యవధిలో మీకు డబ్బు తిరిగి అందుతుంది. అందుకే దీనిని ‘మనీ బ్యాక్ ప్లాన్’ అని కూడా అంటారు.

  • 14 ఏళ్ల పాలసీ: 10వ మరియు 12వ ఏట 30% చొప్పున సమ్ అష్యూర్డ్ అందుతుంది.
  • 16 ఏళ్ల పాలసీ: 12వ మరియు 14వ ఏట 35% చొప్పున అందుతుంది.
  • 18 ఏళ్ల పాలసీ: 14వ మరియు 16వ ఏట 40% చొప్పున అందుతుంది.
  • 20 ఏళ్ల పాలసీ: 16వ మరియు 18వ ఏట 45% చొప్పున అందుతుంది. చివరలో మిగిలిన మొత్తం మరియు ఇతర బోనస్‌లు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి ఇస్తారు.

అదనపు ప్రయోజనాలు:

  1. లోన్ సౌకర్యం: పాలసీ తీసుకున్న ఒక ఏడాది తర్వాత, ప్రీమియంలు సక్రమంగా చెల్లిస్తే లోన్ పొందే అవకాశం ఉంటుంది.
  2. డెత్ బెనిఫిట్: పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తం అందుతుంది.
  3. తీవ్ర అనారోగ్యం (Critical Illness): పాలసీదారుడికి ఏదైనా తీవ్రమైన వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే, బీమా మొత్తంలో 10% వెంటనే అందుతుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.