ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతున్నాయి. పాఠశాల గదిలో చిత్రీకరించిన ఈ వీడియోలో, ఒక తండ్రి తన చిన్నారి కుమార్తె కోసం ఉపాధ్యాయురాలిని బ్రతిమాలుకుంటున్న దృశ్యం అందరి మనసులను కలిచివేస్తోంది.
వైరల్ వీడియోలో ఏముంది? ఆ వీడియోలో, ఒక తండ్రి తన కుమార్తెతో కలిసి క్లాస్‌రూమ్‌లో బెంచ్ మీద కూర్చుని వణుకుతున్న స్వరంతో టీచర్‌తో మాట్లాడుతున్నాడు.
“మేడం, దయచేసి నా కూతురిని కొట్టకండి. తనకి అమ్మ లేదు. తను ఏడిస్తే ఓదార్చేవారు ఎవరూ ఉండరు. నేను తనని ఎంతో గారబంగా, ప్రేమగా పెంచుకున్నాను” అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ఆయన మాటలు విన్న తర్వాత క్లాస్‌రూమ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తండ్రి గొంతులో కనిపిస్తున్న భయం, ప్రేమ మరియు నిస్సహాయత అక్కడున్న వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. తన కుమార్తెకు పాఠశాలలో శిక్ష పడొచ్చనే భయంతో, ఆ తండ్రి నేరుగా క్లాస్‌రూమ్‌కు వచ్చి చేతులు జోడించి తన అభ్యర్థనను తెలియజేసినట్లు తెలుస్తోంది.
కలచివేసిన దృశ్యం: ఆ తండ్రి మాటలు విన్న ఉపాధ్యాయురాలితో పాటు, తరగతి గదిలో ఉన్న ఇతర విద్యార్థులు కూడా చలించిపోయారు. వీడియోలో కొందరు పిల్లలు తల దించుకుని మౌనంగా కూర్చుండగా, మరికొందరి కళ్లలో నీళ్లు తిరగడం కనిపిస్తుంది. ఆ సమయంలో తండ్రి, కూతురు ఇద్దరూ ఎంతో ఆవేదనతో కనిపించారు.


































