భారీగా తగ్గిన బంగారం ధర…డిసెంబర్ 22​వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇవే

నేడు డిసెంబర్ 22వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,170 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.


1,22,990 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 2,13,000 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గడం ప్రారంభించాయి అని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి పరిణామాల కారణంగానే పసిడి ధరలు తగ్గుతున్నట్లు చూడవచ్చు. డాలర్ విలువ బలపడిన నేపథ్యంలోనే బంగారం ధర తగ్గినట్లు గమనించవచ్చు.

డాలర్ బలపడినప్పుడల్లా బంగారం విలువ తగ్గుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లలోకి తరలిస్తున్న నేపథ్యంలోనే బంగారం నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. దీంతోనే బంగారం ధరలో మార్కెట్లో తగ్గుతున్నట్లు గమనించవచ్చు. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ మార్పు కేవలం తాత్కాలికమని నిపుణులు పేర్కొంటున్నారు. గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని ప్రతిరోజు నమోదు చేస్తూ ముందుకు దూసుకొని వెళ్ళాయి. అక్కడి నుంచి ప్రస్తుతం తగ్గడం చూడవచ్చు. బంగారం ధర ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే దాదాపు 90 శాతం పైనే పెరిగినట్లు చూడవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 2025 జనవరి ఒకటో తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేల రూపాయల సమీపంలో ఉంది. అక్కడి నుంచి పసిడి ధర ప్రస్తుతం రెట్టింపుకు సమీపానికి చేరుకుంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలోని పరిణామాలే కారణమని చెప్పవచ్చు.

ఇక బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వెండి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండు లక్షల రూపాయలు దాటి ముందుకు దూసుకుని వెళుతుంది. ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ. 2.10 లక్షల పైన పలుకుతోంది. వెండి ధర విపరీతంగా పెరగడం మార్కెట్లో చూడవచ్చు. దీనికి ప్రధాన కారణం మార్కెట్లో వెండి డిమాండ్ పెరగడమే కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ డిమాండ్ సిల్వర్ పైన చాలా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే వెండికి అమౌంట్ డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా వెండి ధర ఇలాగే పెరిగింది అని చెప్పవచ్చు. వెండి ధర దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగినట్లు ఇక్కడ చూడవచ్చు. వెండి ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వెండి లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.