మందుబాబులకు సీఎం చంద్రబాబు శుభవార్త.. ఏం చెప్పారో తెలుసా?

ఎన్నికల్లో కీలకంగా మారిన మద్యంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై తాగుబోతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.


లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పున:పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉంటుందని చెప్పారు. బెల్టుషాపుల నియంత్రణకు హర్యానా మోడల్‌పై అధ్యయనం చేయాలని ఆదేశించారు. మద్యంపై కీలక ఆదేశాలు అధికారులకు ఇచ్చారు.

అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్ చేశారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా.. ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని అధికారులకు చెప్పారు. మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని స్పష్టం చేశారు. లాటరీలో మద్యం దుకాణాల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, ఇంకా.. లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు తదితర అంశాలపై కసరత్తు చేయాలని ఎక్సైజ్‌ అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పారు. బార్ ఏఆర్ఈటీ (అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ టాక్స్) మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.

ఎక్సైజ్‌ శాఖ అంశంపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరణ ఇచ్చారు. అక్రమ మద్యం అరికట్టడం, బెల్టుషాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమీక్షలో సమగ్రంగా మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు.

మద్యం విక్రయాలు ఇలా
లక్ష్యం: అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రూ.8,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం
సాధించిన లక్ష్యం: రూ.7,041 కోట్లు మద్యం ఆదాయం
==> 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం పెరుగుదల
==> మద్యం విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరుగుదల
==> ఆర్ధిక సంవత్సరంలో 3 శాతం పెరుగుదల
==> డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

మొత్తంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో 3 శాతం పెరుగుదల చూపిస్తామని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. అంతర్జాతీయ బ్రాండ్‌లు తీసుకురావడం, నాణ్యమైన మద్యం అందుబాటు ధరకు అందివడంతో మద్యం, బీర్ విక్రయాల్లో ఏపీ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వృద్ధి కనబరిచిందని అధికారులు వివరించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9 శాతం పెరిగాయని, కొన్ని జిల్లాల్లో 40-47 శాతం వరకు డిజిటల్ లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించారు. నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ చెల్లింపులు జరిగేలా అందరిలో అవగాహన పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్రంలో నకిలీ మద్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక లిన్ (లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్) త్వరితగతిన తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పూర్తి పారదర్శకత వస్తుందని.. ట్రాకింగ్, షాపుల రేషనలైజేషన్‌పైనా దృష్టి పెట్టాలని చెప్పారు. బెల్టుషాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బెల్టు షాపులు పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి హర్యానాలో అనుసరించిన విధానం అధ్యయనం చేయాలని సూచించారు.

ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.