రేపు పబ్లిక్‌ హలీడే.. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

ఈ ఏడాది సెలవుల సంవత్సరంగా చెప్పవచ్చు. అత్యధిక సెలవులు వరుసగా మూడు నెలలు వస్తుండగా చివరి నెల డిసెంబర్‌లో కూడా భారీగా సెలవులు వస్తున్నాయి.


క్రిస్మస్‌ నెల కావడంతో ఈ నెలలో సెలవులు వచ్చాయి. ఈ క్రమంలోనే రేపు పబ్లిక్‌ హలీడే వచ్చింది. రేపు సోమవారం బ్యాంకులు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా బంద్‌ ఉండనున్నాయి. ఇంతకీ డిసెంబర్‌ 22వ తేదీన ఏముంది? ఎందుకు సెలవు ఇచ్చారు? ఎక్కడ పబ్లిక్‌ హలీడే అనే విషయం తెలుసుకుందాం.

భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యథావిధిగా పని దినం (వర్కింగ్‌ డే). తెలంగాణ, ఏపీలో ఎలాంటి సెలవు లేదు. పబ్లిక్‌ హలీడే ఇచ్చింది మాత్రం సిక్కిం రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులతోపాటు పాఠశాలలకు సెలవు ఉంది. డిసెంబర్‌ 22వ తేదీన సిక్కింలో అత్యంత ప్రధానమైన పండుగ ఉంది. ఆ రాష్ట్రంలో లొసుంగ్ లేదా నాంసోంగ్ అనే ప్రాంతీయ పండుగ జరుగుతోంది. ఈ పండుగ సందర్భంగా సిక్కింలో పబ్లిక్ హాలిడే ఉంది. పబ్లిక్‌ హలీడే అంటే ఆ రోజు అన్నింటికి సెలవు ఉంటాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఇలా అన్నింటికి సెలవు ఉంటుంది.

సిక్కింలో లొసుంగ్‌ లేదా నాంసొంగ్‌ పండుగ అక్కడ ప్రధానమైనది. ఇది పంట కాలం ముగింపును, టిబెటన్ సంవత్సరం ముగింపును సూచిస్తుంది. కొన్ని తెగల వారు అక్కడ ఎంతో సంబరంగా ఈ వేడుకను చేసుకుంటారు. చెడుపై మంచి విజయాన్ని చేసుకోవడానికి ఆ రాష్ట్రంలోని మొత్తం ఆరు జిల్లాలు ఉండగా.. వాటిలో నాలుగు జిల్లాల్లో ఈ పండుగను చేసుకుంటారు. దీంతో అక్కడ లోసుంగ్‌, నాంసొంగ్‌ పండుగ సందర్భంగా పబ్లిక్‌ హలీడే ప్రకటిస్తారు.

లోసుంగ్‌, నాసొంగ్‌ పండుగలో భాగంగా లెప్చా తెగవారు అనేక మతపరమైన నృత్యాలు చేస్తుంటారు. పండుగ సమయంలో వివిధ ప్రదేశాలలో సాంప్రదాయ విలువిద్య పోటీలు జరుగుతాయి. ఈ పండుగ సందర్భంగా పబ్లిక్‌ హలీడే ఇవ్వడంతో విద్యార్థులు, ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులకు సెలవు లభించనుంది. ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం వరకు క్రిస్మస్ పండుగ వరకు అక్కడ సెలవులు ఉంటాయని తెలుస్తోంది. కానీ ఇది ఇంకా అధికారికంగా తెలియలేదు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.