ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల అమెరికాలో కాదు, మన భారతదేశంలోనే ఉంది! 60,000 మంది విద్యార్థులున్న ఈ స్కూల్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

న భారతదేశం విద్యా రంగంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక్కడ ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ క్యాంపస్ ఎక్కడ ఉందో తెలుసా?


మరెక్కడో కాదు, మన లక్నోలో! అవును, అక్కడ ఉన్న ‘సిటీ మాంటిస్సోరి స్కూల్’ (City Montessori School – CMS) ఇప్పుడు ప్రపంచస్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. అత్యధిక విద్యార్థుల నమోదుతో ఈ పాఠశాల మన దేశానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తెచ్చిపెట్టింది.

గిన్నిస్ బుక్‌లో మన గర్వకారణమైన పాఠశాల ఈ పాఠశాల కేవలం పేరుకే పెద్దది కాదు, ఇది అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. లక్నో నగరం అంతటా దీనికి పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.. ఇక్కడ LKG నుండి 12వ తరగతి వరకు దాదాపు 60,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు! ఒకే మేనేజ్‌మెంట్ కింద ఇంతమంది విద్యార్థులు, వేల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం.

నంబర్ వన్ ఎలా అయింది? ప్రపంచంలోని ఇతర పాఠశాలలతో పోలిస్తే, ఇక్కడ అడ్మిషన్ పొందిన విద్యార్థుల సంఖ్యే అత్యధికం. లక్నోలో మాత్రమే దీనికి 20కి పైగా సుసజ్జితమైన క్యాంపస్‌లు ఉన్నాయి. అన్ని చోట్లా ఒకే రకమైన బోధన, ఒకే రకమైన విధానాన్ని పాటిస్తారు. అందుకే ఇది కేవలం పాఠశాలలా కాకుండా, ఒక విద్యా సామ్రాజ్యంలా కనిపిస్తుంది. ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను నడపడం సామాన్యమైన విషయం కాదు.

అద్దె గదిలో మొదలైన మహా ప్రస్థానం ఇంత పెద్ద సంస్థగా ఎదిగిన ఇది కేవలం 5గురు పిల్లలతో మొదలైందంటే మీరు నమ్మాలి. 1959లో డాక్టర్ జగదీష్ గాంధీ మరియు డాక్టర్ భారతి గాంధీ దంపతులు ఒక చిన్న అద్దె గదిలో ఈ స్కూల్‌ను ప్రారంభించారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ పాటించడం వల్ల నేడు ఇది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది మహావృక్షంలా ఎదిగింది.

హైటెక్ సౌకర్యాలకు కొదవ లేదు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఇక్కడ నాణ్యత విషయంలో రాజీ పడరు. ప్రతి క్యాంపస్‌లో స్మార్ట్ క్లాస్‌లు, హైటెక్ సైన్స్ ల్యాబ్‌లు, ఆట స్థలాలు, పెద్ద ఆడిటోరియాలు మరియు లైబ్రరీలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ నెట్‌వర్క్ కలిగిన కీర్తి దీనికే దక్కుతుంది. ఇక్కడి సౌకర్యాలను చూస్తే ఎవరికైనా ఇక్కడే చదువుకోవాలి అనిపిస్తుంది.

కేవలం పాఠాలే కాదు, విలువలకూ పెద్దపీట ఇక్కడ ICSE మరియు ISC సిలబస్‌తో పాటు పిల్లలకు నైతిక విలువలు, శాంతి పాఠాలను కూడా బోధిస్తారు. కేవలం గిన్నిస్ రికార్డ్ మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి ఎన్నో అవార్డులు ఈ పాఠశాలను వరించాయి. మన భారత్‌లో ఇలాంటి అద్భుతమైన పాఠశాల ఉండటం నిజంగా గర్వకారణం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.