రైలు ప్రయాణం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ప్రయాణంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలా విషయాలను గమనిస్తుంటారు. అయితే, రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే వారు గమనించే ఒక వింత విషయం ఏంటంటే..
తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైళ్లు తరచుగా హారన్ కొడుతుంటాయి. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రైల్వే హారన్ రకాలు: రైల్వేలో ఒక్కో రకమైన హారన్‌కు ఒక్కో అర్థం ఉంటుంది. ముఖ్యంగా భారతీయ రైల్వేలో 11 రకాల హారన్ సిగ్నల్స్ వాడుతుంటారు:
- ఒక సుదీర్ఘ హారన్: ప్రయాణికులు ఎక్కడానికి సిద్ధం కావాలని సంకేతం.
- రెండు చిన్న హారన్లు: రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అర్థం.
- నాలుగు చిన్న హారన్లు: రైలులో ఏదైనా సాంకేతిక లోపం ఉందని సూచిస్తుంది.
- ఆరు చిన్న హారన్లు: అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ని సూచిస్తుంది.
- ఒక పొడవైన మరియు ఒక చిన్న హారన్: బ్రేక్ సిస్టమ్‌ను సెట్ చేసే సంకేతం.
- ఆగి ఆగి వచ్చే హారన్: రైల్వే క్రాసింగ్ (గేట్) వస్తోందని హెచ్చరిక.
తెల్లవారుజామున 3 గంటలకే ఎందుకు? నివేదికల ప్రకారం, తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైళ్లు హారన్ కొట్టడానికి ప్రధానంగా భద్రత కారణాలే ఉన్నాయి:
- అడవి జంతువులు/మనుషుల హెచ్చరిక: రాత్రి పూట లేదా తెల్లవారుజామున మనుషులు లేదా జంతువులు (ముఖ్యంగా ఏనుగులు, పశువులు) అజాగ్రత్తగా పట్టాలపై ఉండే అవకాశం ఉంటుంది. చీకటిలో లోకో పైలట్‌కు అవి సరిగ్గా కనిపించవు కాబట్టి, హారన్ ద్వారా వాటిని అప్రమత్తం చేస్తారు.
- లోకో పైలట్ అప్రమత్తత: రాత్రి పూట లోకో పైలట్ నిద్రపోకుండా, అప్రమత్తంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి గార్డ్ మరియు పైలట్ మధ్య హారన్ ద్వారా సంభాషణ జరుగుతుంది.
- లెవల్ క్రాసింగ్స్: గేట్లు లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద హారన్ కొట్టడం చట్టరీత్యా తప్పనిసరి.
- యాార్డులో క్లీనింగ్: రైలు క్లీనింగ్ కోసం యార్డులోకి వెళ్లేటప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేయడానికి చిన్న హారన్ ఉపయోగిస్తారు.


































