విశాఖ పూర్ణామార్కెట్లోని పూజా ద్రవ్యాల విక్రయ దుకాణంలో ఇవాళ(మంగళవారం) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్కన ఉన్న షాపులకు నిప్పంటుకోకుండా మంటలను అదుపు చేశారు. దీంతో ప్రాణం నష్టం జరగలేదు.
పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంత మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


































