ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో.. 64 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న ఏకైక నటుడు..

www.mannamweb.com


మనుషులు కాలం మారుతున్న కొద్ది.. ఆ ట్రెండ్ కు తగ్గట్టు మారుతూ వస్తున్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే. చాలామంది నటులు ఎక్కువ కాలం యాక్టీవ్ గా ఉన్నది లేదు.60 ఏళ్లకు పైగా సినిమాల్లో యాక్టీవ్ గా ఉన్న నటులు అసలే లేరు.
కానీ ఒకే ఒక్క హీరో లోకనాయకుడు కమల్ హాసన్. దాదాపు 64 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 1960లో ‘కలతుర్ కన్నమ్మ’ చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేసి 20 ఏళ్లలో తమిళ స్టార్ గా ఎదిగాడు కమల్ హాసన్.

అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న ఆయన నటించడం ప్రారంభించి నేటికి 64 ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చెసుకున్నాడు. కాగా ప్రజంట్ తన 234వ సినిమా చేస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ ‘ఇండియన్ 2’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ మొదటి చిత్రానికి పారితోషికం రూ.500 రూపాయలు ఇచ్చారట. 60 ఏళ్ళ కిందట రూ.500 అంటే.. చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి. ఇక రూ.500 రూపాయలతో మొదలైన తన సినీ జీవితం.. ఇప్పుడు రూ.150 కోట్లుకు చేరుకుంది . ఇంత సక్సెస్ కి కారణం కమల్ హాసన్..తన కష్టం పై పెట్టుకున్న నమ్మకం. అందుకే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ 64 ఏళ్ల సినిమా జీవితం పూర్తి చేసుకున్న ఏకైక హీరోగా చరిత్ర సృష్టించాడు.