వైద్యారోగ్యశాఖలో పని చేయాలి అనుకునేవారికి గుడ్‌న్యూస్. ఏపీ వైద్యారోగ్య శాఖ 60 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ వైద్యారోగ్య శాఖ పలు ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అయితే ఈ ఖాళీలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. యూపీహెచ్సీ, పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. దరఖాస్తు చేసేందుకు డిసెంబరు 31ని చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 22వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
కృష్ణ జిల్లాలోని ఆరోగ్య సంస్థల్లోని వివిధ పోస్టులకు కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా నోటిఫికేషన్ వెలువడింది.
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ-16
శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు 10
ఈ నోటిఫికేషన్లో మెుత్తం 38 పోస్టులు ఉన్నాయి. మహిళా నర్సింగ్, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులకు SSC లేదా దాని తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ల్యాబ్-టెక్నీషియన్ Gr-IIకి కూడా ప్రభుత్వం గుర్తించిన ఎస్ఎస్సీ లేదా దాని తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. గుర్తింపు పొందిన సంస్థ/A.P. విశ్వవిద్యాలయం నుండి MLT లేదా B.Sc(MLTలో డిప్లొమా కలిగి ఉండాలి. లేదంటే MLTతో ఇంటర్మీడియట్ వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్/క్లినికల్ శిక్షణ కావాలి. తప్పనిసరిగా ఏపీపీఎంబీలో నమోదు అయి ఉండాలి. అభ్యర్థికి డి.ఎం.ఎల్.టి, బి.ఎస్సీ ఎం.ఎల్.టి రెండూ ఉన్నట్లయితే, పై వాటిలో దేనిలో అత్యధిక శాతం మార్కులు సాధించారో దానిని పరిగణనలోకి తీసుకుంటారు.
వయసు 42 సంవత్సరాలకు మించి ఉండకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు 300 అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
మరో నోటిఫికేషన్
యూపీహెచ్‌సీల్లో గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టు 1
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 10
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12
ఫార్మసిస్ట్ పోస్టుకు గుర్తింపు పొందిన సంస్థ/A.P విశ్వవిద్యాలయం నుండి ఫార్మసీలో డిప్లొమా / B.Pharmacy ఉత్తీర్ణులై ఉండాలి. AP ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు, ఫార్మసీ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి.
ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుండి MLTలో డిప్లొమా లేదా విశ్వవిద్యాలయం నుండి B.Sc (MLT) లేదా MLT తో ఇంటర్మీడియట్ వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్/క్లినికల్ శిక్షణ కలిగి ఉండాలి. APPMB లో నమోదు చేసుకోవాలి. అభ్యర్థి DMLT, B, ScMLT రెండింటినీ కలిగి ఉంటే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందిన గరిష్ట శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
డేటా ఎంట్రీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలితో గుర్తింపు పొందిన సంస్థ నుండి పి.జి. డి.సి.ఎ. కలిగి ఉండాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులకు పదో తరగతి పాస్ అయి ఉండాలి.
నోటిఫికేషన్ వివరాలను https:///krishna.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించాలి.


































