ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇక ప్రతీ శుక్రవారం.. వచ్చేస్తారు

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల సేవల్ని బాగా ఉపయోగించింది. అప్పట్లో ఆ వ్యవస్థ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..
వాలంటీర్ల వ్యవస్థ ఎప్పుడో రద్దైపోయిందనీ, వైసీపీయే దాన్ని రద్దు చేసింది అని చెప్పి.. దాన్ని వదిలేసింది. దాని స్థానంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్నీ అమలు చేయిస్తోంది. ఇప్పుడు వాలంటీర్ల అవసరం లేకుండా కూడా పనులు అయిపోతున్నాయి. అందువల్ల ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. దీనికి తోడు ప్రభుత్వం వాట్సాప్ మన మిత్ర ఛానల్ ద్వారా చాలా రకాల సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దాంతో ప్రజలు టెక్నాలజీని వాడేసుకుంటూ.. పనులను పూర్తి చేయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.


ప్రతీ శుక్రవారం.. మన మిత్ర క్యాంపెయిన్:
ఏపీ ప్రభుత్వం ప్రతీ శుక్రవారం.. మన మిత్ర క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. దీని ద్వారా.. ఇంటింటికీ వెళ్లి.. వాట్సాప్ మన మిత్ర యాప్ ఎలా వాడాలో, అందులో ఏయే సర్వీసులు అందుబాటులో ఉన్నాయో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వివరిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇళ్లకు రాలేకపోతే.. గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రజలే వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతీ శుక్రవారం ఇది జరుగుతుంది.

ఇంటింటికీ వెళ్లి ప్రచారం:
సచివాలయ ఉద్యోగులు ప్రతీ శుక్రవారం ఇళ్లకు వెళ్లి.. డోర్ కొట్టి.. ఇంట్లో వాళ్లకు తాము ఎందుకు వచ్చిందీ చెబుతారు. ఆ తర్వాత వాట్సాప్‌లో మన మిత్ర యాప్ ఎలా వాడాలో చూపిస్తారు. అందులో ఏయే ప్రభుత్వ సర్వీసులు అందుబాటులో ఉన్నాయో, వాటిని ఎలా పొందాలో చూపిస్తారు. ఆ తర్వాత పాంప్లెట్లు ఇచ్చి.. QR కోడ్ చూపిస్తారు. ప్రజలు ఆ కోడ్ ని స్కాన్ చేసి.. వాట్సాప్ మనమిత్ర వివరాలు పొందుతారు.

ఎక్కడైనా శుక్రవారం నాడు సచివాలయ ఉద్యోగులు రాకపోతే.. ప్రజలే వారికి కాల్ చేసి.. ఎప్పుడొస్తారు అని అడగవచ్చు. వారు టైమ్ చెప్పి వచ్చేస్తారు. ఒకవేళ ఉద్యోగులు రాలేకపోతే.. పంచాయతీ సెక్రెటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ కలిసి ఏయే ఇళ్లను కవర్ చెయ్యాలో, ఏవి మిగిలిపోయాయో ఆ వివరాలు రాసుకుంటారు. ఆ ఇళ్లను నెక్ట్స్ శుక్రవారం కవర్ చేస్తారు.

వాళ్లు కూడా వస్తారు:
ఇక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు (VROs), సర్వే అసిస్టెంట్లు, వార్డ్ రెవెన్యూ సెక్రెటరీలు కూడా మన ఇళ్లకు వచ్చి.. తలుపు తడతారు. మనం కంగారు పడకుండా మీరు ఎవరు అని నిలదీయాలి. వారు ఎవరో అధికారికంగా ప్రూఫ్ చూపించమని కోరాలి. వారి ఐడీ కార్డులను చెక్ చెయ్యాలి. వారు నిజమైన వారే అయితే.. అప్పుడు మనం ఎందుకొచ్చారో కనుక్కోవచ్చు. ఎందుకంటే.. దొంగలు కూడా అధికారుల పేర్లు చెప్పి మన ఇళ్లకు వస్తుంటారు. మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి. సరే.. ఈ ఆఫీసర్లు ఎందుకు వస్తారంటే.. వీరు మనకు రెవెన్యూ, ల్యాండ్ సంబంధిత ప్రభుత్వ సేవల గురించి చెబుతూ అవగాహన కలిగిస్తారు.

వీళ్లు కూడా వస్తారు:
ఇక మన ఇళ్లకు విద్యుత్ శాఖ నుంచి ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ సెక్రెటరీలు కూడా వస్తారు. వీళ్లు.. వాట్సాప్ ఈ-గవర్నెన్స్‌లో విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ బిల్లులు, విద్యుత్ కంప్లైంట్ల వంటి అంశాలపై మనకు అవగాహన కలిగిస్తారు.

ఇంకా ఎవరొస్తారంటే..:
మున్సిపల్ కమిషనర్లు, MPDOలు వచ్చి అవసరమైన లాజిస్టిక్స్, ప్రచారం, సపోర్టు ఇస్తూ.. వాటి గురించి వివరిస్తారు. అలాగే.. వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, వెటెర్నరీ, ఫిషరీస్, ANM, వార్డ్ హెల్త్ సెక్రెటరీలు కూడా మన ఇళ్లకు ప్రతీ శుక్రవారం వస్తారు. తమ తమ శాఖల వారీగా ఉన్న వాట్సాప్ ఈ-గవర్నెన్స్, మన మిత్ర సేవల్ని వివరిస్తారు.

ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ ఉచిత సేవల్ని మనం అందుకోవాలి. ఈ-గవర్నెన్స్, మన మిత్ర గురించి పూర్తి ఐడియా తెచ్చుకోవాలి. ఇక ఎవ్వర్నీ అడిగే పని లేకుండా.. మనమే నలుగురికి చెప్పే స్థాయిలో అవగాహన తెచ్చుకుంటే.. ప్రభుత్వ సేవల్ని ఈజీగా పొందగలం. కాబట్టి.. ప్రతీ శుక్రవారం మన ఇళ్లకు ఎవరు వస్తారో గమనించుకుంటూ ఉండాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.