మీ కిడ్నీలు టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయాలంటే ఈ నేచురల్ డ్రింక్స్ తప్పనిసరి

మీ కిడ్నీలను సహజంగా క్లీన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ హెల్తీ డ్రింక్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. నిమ్మరసం నుంచి కొబ్బరి నీళ్ల వరకు.. కిడ్నీల ఫిల్ట్రేషన్ సామర్థ్యాన్ని పెంచే పానీయాల గురించి నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించుకునే సింపుల్ చిట్కాలు మీకోసం.

శరీరంలో సమతుల్యతను కాపాడటంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీల పనితీరును మెరుగుపరిచేందుకు నీరు ప్రాథమికమైనప్పటికీ, ఇతర పోషక పానీయాలు కూడా కిడ్నీలకు అదనపు రక్షణను ఇస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

కిడ్నీ ఫ్రెండ్లీ పానీయాలు ఇవే:

నిమ్మరసం : ఇందులో ఉండే సిట్రేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడానికి (Detox) ఇది గొప్ప ఎంపిక.

క్రాన్ బెర్రీ జ్యూస్ : మూత్రనాళ ఇన్ఫెక్షన్లను (UTI) నివారించడంలో ఇది పెట్టింది పేరు. బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవడం ద్వారా కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

గ్రీన్ టీ : ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మంటను ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, కిడ్నీల ఫిల్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

అల్లం టీ : అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కిడ్నీల కణజాలాన్ని రక్షిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

బీట్‌రూట్ జ్యూస్ : ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది. కిడ్నీలలో రక్త ప్రసరణ బాగుంటే వాటి పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది.

బార్లీ నీరు : కిడ్నీలను శుభ్రం చేయడానికి ఇది పురాతనమైన మరియు ఉత్తమమైన రెమెడీ. ఇది కిడ్నీలో రాళ్లను కరిగించడంలో మరియు టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నీళ్లు: ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. సహజమైన పొటాషియం కిడ్నీల విధులను క్రమబద్ధీకరించడంలో తోడ్పడుతుంది.

నీటితో పాటు ఈ పానీయాలను తీసుకోవడం వల్ల కిడ్నీలు క్లీన్ అవ్వడమే కాకుండా, మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

గమనిక : పైన పేర్కొన్న వార్తా కథనాలు, ఆరోగ్య సూత్రాలు ఇతర సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. వీటిని అందించడంలో మేము వివిధ వైద్య అధ్యయనాలు, నిపుణుల సలహాలు మరియు వార్తా నివేదికలను ప్రాతిపదికగా తీసుకున్నాము.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.