ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి(Telugu Film Chamber President)గా సురేశ్ బాబు(Suresh Babu) ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్(Progressive panel) అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.


ఈ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబుకు మద్దతు తెలిపారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి సురేశ్ బాబు సైతం గెలుపొందారు. మొత్తం 48 మంది పోటీ చేయగా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 31 మంది, మన ప్యానల్ నుంచి 17 మంది ఈసీ మెబర్లుగా విజయం సాధించారు. పెద్దప్రొడ్యూసర్ల ప్రోగ్రెసివ్ ప్యానల్‌గా..చిన్న నిర్మాతలుమన ప్యానల్‌గా ఎన్నికల్లో పోటీ చేశారు.

దీంతో ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబును, ఉపాధ్యాక్షుడిగా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా రామదాసులును ఈసీ సభ్యులు ఎన్నుకున్నారు. మరో 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ కొత్త కార్యవర్గం 2027 వరకు కొనసాగుంది. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో మొత్తం 3335 మంది సభ్యులున్నారు. వీరిలో 1421 మాత్రమే ఛాంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.