రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి ఆరు కేజీలు ఉచితం, తీసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటుగా పంచదార, గోధుమపిండి, జొన్నలు, రాగులు వంటి ఐదు రకాల సరుకుల్ని అందించనుంది.


డిసెంబర్ నుంచే జొన్నలు, రాగులు పంపిణీ ప్రారంభించగా.. వచ్చే నెలలో గోధుమ పిండిని పంపిణీ చేయనుంది. గతంలో ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం ఇచ్చేవారు.. ఇప్పుడు కుటుంబ సభ్యులు తమకు కావాల్సిన జొన్నలు, రాగులను ఎంచుకుంటే, బియ్యం పరిమాణాన్ని తగ్గించి వాటిని అందిస్తారు. ఉదాహరణకు ఒక కుటుంబం 3 కేజీల జొన్నలు, 3 కేజీల రాగులు తీసుకుంటే.. మొత్తం 6 కేజీలు అవుతుంది. అప్పుడు మిగిలిన 14 కేజీల బియ్యం ఇస్తారు. అలాగే అరకేజీ పంచదార, 1 కేజీ గోధుమపిండిని కూడా అందిస్తారు. గోధుమపిండిని కేజీ రూ.20 చొప్పున ఇవ్వనున్నారు.

ప్రభుత్వం ఈ కొత్త పథకం ద్వారా ప్రజలకు పోషకాహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రేషన్ లో చేర్చడం వల్ల సామాన్యులకు కూడా ఈ పోషకాలు అందుబాటులోకి వస్తాయి. కుటుంబ సభ్యుల అవసరాలకు అనుగుణంగా బియ్యంతో పాటు ఇతర సరుకులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. గోధుమపిండిని కేజీ రూ.20కే అందించడం వల్ల, మార్కెట్ ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ విధంగా, ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెరతో పాటు రాగులు, జొన్నలు, గోధుమపిండి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ పంపిణీ ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కుటుంబాలు 25 కిలోల బియ్యం తీసుకుంటే.. అందులో మూడు కిలోల బియ్యానికి బదులుగా రాగులు లేదా జొన్నలు ఎంచుకోవచ్చు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి రూ.65 వరకు అమ్ముడవుతున్న గోధుమపిండిని, రాష్ట్ర ప్రభుత్వం చౌకదుకాణాల్లో కిలో రూ.20కే ప్యాకెట్ రూపంలో అందించనుంది. వీటిలో జొన్నలు, రాగులు డిసెంబర్ నెలలో పంపిణీ చేశారు.. గోధుమ పిండి మాత్రం జనవరి నుంచి ప్రారంభం అవుతుంది.

ఇదిలా ఉంటే.. రేషన్‌కార్డులు ఉన్నవారికి కందిపప్పు కోసం నిరీక్షణ తప్పడం లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచి కేటాయింపులు లేకపోవడంతో రేషన్ డీలర్లు కందిపప్పు పంపిణీ చేయడం లేదు. ముఖ్యంగా పండుగల సమయంలో కూడా ఈ సమస్య కొనసాగుతోంది.. జనవరి నెలలోనూ సరఫరా ఉంటుందా లేదా అన్నది చూడాలి. డిసెంబర్ నెలలో కూడా కందిపప్పు కేటాయింపులు జరగకపోవడంతో పంపిణీ ఆగిపోయింది. బయట మార్కెట్‌లో కందిపప్పు నాణ్యతను బట్టి కిలో రూ.110 నుంచి రూ.120 వరకు అమ్ముడవుతోంది. కానీ, పౌరసరఫరాల శాఖ ద్వారా ఇది కేవలం రూ.67కే లభిస్తుంది. ఈ తక్కువ ధరకే కందిపప్పు అందజేయడానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచి కేటాయింపులు రావడం లేదు. దీంతో రేషన్ డీలర్లు కందిపప్పు కోసం డీడీలు తీయడానికి ముందుకు రావడం లేదు. కందిపప్పు సరఫరా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై స్పష్టత లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.