భారీ డిమాండ్‌ బిజినెస్‌.. కాస్త పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే చాలు! లక్షల ఆదాయం పొందొచ్చు

న దేశంలో చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల పంటలు మాత్రమే పండుతాయి. అక్కడి నేల రకాలు, నీటి లభ్యత కారణంగా కొన్ని పంటలకే అక్కడి రైతులు పరిమితం అవుతారు.


కొంతమంది రైతులకు ఎక్కువ భూమి ఉండి కూడా పెద్దగా ఆదాయం పొందలేకపోతుంటారు. అలాంటి వాళ్లు కాస్త పెట్టుబడి పెట్టుకునే స్థోమత ఉంటే గొర్రెల పెంపకంతో భారీగా ఆదాయం పొందవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో నాన్‌ వెజ్‌ తినే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పైగా మటన్‌కు మంచి డిమాండ్‌ ఉంది. నాణ్యమైన మటన్‌ను సప్లైయ్‌ చేసేవారికి భారీ మొత్తంలో ధర చెల్లించేందుకు పలు పెద్ద పెద్ద హోటల్స్‌ వాళ్లు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో గొర్రెల పెంపకం ప్రారంభిస్తే అతి తక్కువ టైమ్‌లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వడ్డీతో సహా పొందొచ్చు. అయితే ఈ వ్యాపారం కోసం భూమి చాలా అవసరం. కేవలం గొర్రెల కోసం షెడ్డు మాత్రమే కాకుండా వాటికి మేత పెంచడం కోసం కూడా భూమి కావాలి.

ఈ వ్యాపారం రైతులకు అయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అలా అని మిగతా వాళ్లు చేయకూడదని కాదు. కానీ, కాస్త జీవాల గురించి అవగాహన కలిగి ఉండాలి. మంచి బ్రీడ్‌ను ఎంచుకొని వాటిని పెంచితే.. ఒకేసారి లాట్‌లో అమ్మితే మంచి లాభం చూడొచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని అతి తక్కువ జీవాలతో ప్రారంభించాలనుకున్న కనీసంలో కనీసం ఓ రూ.10 లక్షల పెట్టుబడి అయితే అవసరం అవుతుంది. రూ.5 లక్షల షెడ్డు నిర్మాణం, దాణా, పని వాళ్లుకు అవుతాయి. మిగతా రూ.5 లక్షలతో జీవాలు కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ బిజినెస్‌ ఒక్కసారి సెట్‌ అయి లాభాలా బాట పడితే మాత్రం ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన పని ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.