బిజీగా ఉండేవారి కోసం 5 నిమిషాల హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ! రాత్రి నానబెట్టి పొద్దునే తినేయొచ్చు

మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి అల్పాహారం చాలా ముఖ్యం. అల్పాహారం మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, చురుగ్గా ఉంచుతుంది. అయితే, ఉదయం పూట ఆఫీసు లేదా పని మీద బయటికి వెళ్లే తొందరలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు.


అలాంటి వారి కోసం ప్రముఖ డాక్టర్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపారు. దీన్ని తయారు చేయడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. ముందు రోజు రాత్రే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఒకే పూట భోజనంలో మీకు దాదాపు 45 గ్రాముల ప్రోటీన్, 17 గ్రాముల ఫైబర్ అందుతుంది, మీ జీర్ణక్రియకు చాలా మంచిది కూడా. ఉదయం పూట వంట చేయడానికి టైం లేని బిజీ వ్యక్తులకు ఇది చాల ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉదయాన్నే భోజనం చేయలేకపోయిన వాళ్ళు పోషకాలు పొందాలనుకునే వారికి ఇదొక గొప్ప వార్త.

5 నిమిషాల రాత్రిపూట ఓట్స్ రెసిపీ :
పదార్థాలు
2 టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్
2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు
1 టేబుల్ స్పూన్ జనపనార గింజలు
1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలు
2 టేబుల్ స్పూన్లు రుచిలేని వె ప్రోటీన్
1 టేబుల్ స్పూన్ ముడి కోకో
1 టేబుల్ స్పూన్ పినట్ బటర్
1 టేబుల్ స్పూన్ మాపుల్ సిరప్
150-200ml పాలు

ఎలా చేయాలంటే:
ముందుగా ఈ పదార్థాలను రెడీ చేసుకోండి.
అన్నిటిని ఒక గిన్నెలో వేసి, బాగా కలిసేలా కలపండి.
ఒక జార్ లో వేసి రాత్రంతా నానబెట్టేందుకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
ఉదయం గ్రీక్ యోగర్ట్ తో తినండి

సాధారణంగా ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు కలపాలి. అవిసె గింజలు & హెంప్ సీడ్స్ ఓట్స్‌కు ప్రోటీన్, పీచు పదార్థాన్ని అందించడానికి వీటిని వాడతారు. చియా గింజలు ఇవి అల్పాహారానికి తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను ఇస్తాయి. ముడి కోకో కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మీ ఆరోగ్యం కోసం వే-ప్రోటీన్‌ను ఇందులో వాడాలి. అయితే ఇందులో కృత్రిమ తీపి పదార్థాలు లేకుండా చూసుకోవాలి. నట్స్ బటర్ శరీరానికి మంచి కొవ్వులను అందిస్తుంది, దీనివల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

పైన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి పాలు లేదా నీటితో బాగా కలపాలి. మీకు తీపి కావాలంటే తేనె లేదా మాపుల్ సిరప్ వంటివి వాడటం మంచిది. తరువాత ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం తినే ముందు ఇందులో కొంచెం ప్రోబయోటిక్ పెరుగు కలిపితే, అది ప్రేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.