స్టార్ హీరో ఇంటి కోడలుగా వెళ్తున్న రోజా కూతురు.. హాట్ టాపిక్‌గా రోజా కామెంట్స్

రాజకీయ వేదికపై ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి రోజా కుమార్తె గురించి వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది. తన కుమార్తె అన్షు మాలికపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను ఖండించింది.


అన్షు ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళుతోందని.. హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందని… ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. వీటన్నింటిపై స్పందించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చింది. అన్షుకు నటి కావాలనే కోరిక లేదన్న ఆమె.. కూతురు సైంటిస్ట్ కావాలనుకుంటోందని, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారిస్తోందని చెప్పింది. ఇటాలియన్ భాష కూడా నేర్చుకుంటోందని తెలిపింది. పిల్లలపై తాను ఎలాంటి ఒత్తిడి పెట్టనని, వాళ్ల భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఒక స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతోందనే ప్రచారంపై స్పందిస్తూ… ఆ స్టార్ ఎవరో చెబితే తాను కూడా తెలుసుకుంటానని నవ్వుతూ సమాధానమిచ్చింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.