పెయిన్‌కిల్లర్లపై కేంద్రం కొరడా.. ఇక ఈ నొప్పుల మాత్రలు పూర్తిగా నిషేదం

 మద్యం మనం చాలా వీక్ అయిపోతున్నాం. చిన్నచిన్న నొప్పులు కూడా తట్టుకోలేక పెయిన్ కిల్లర్లపై విపరీతంగా ఆధారపడుతున్నాం. అయితే పలు రకాల పెయిన్‌కిల్లర్‌ వలన దుష్ప్రభావాలు అధికంగా ఉంటున్నాయి.


ఈ నేపధ్యంలోనే ఓ ప్రముఖ పెయిన్‌కిల్లర్‌ ట్యాబ్లెట్ పై కేంద్రం కొరడా ఝుళిపించింది. నిషేదిత జాబితాలోకి ఈ మాత్రను నెట్టేసి.. తయారీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది

పెయిన్‌కిల్లర్‌ నిమెసులైడ్‌ (Painkiller Nimesulide ) పరిచయం అవసరం ప్రముఖ ఔషదం. అయితే ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ కు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆరోగ్యపరమైన భద్రతా కారణాల రీత్యా నిమెసులైడ్‌ ను తక్షణమే నిషేధిత జాబితాలో చేర్చింది. అంతే కాదు తయారీ క్రయవిక్రయాలు కూడా పూర్తిగా నిలివేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నోటి ద్వారా తీసుకొనే ఈ ఔషధం దుష్ప్రభావాలకు దారి తీస్తుందని కాబట్టి వెంటనే దీన్ని బ్యాన్ చేయాలని సూచించింది. డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డుతో చర్చించిన అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకుంది.

దుష్ప్రభావాలు

పెయిన్‌కిల్లర్‌ నిమెసులైడ్‌ వల్ల దుష్ప్రభావాలు ఉన్నట్లు గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. నాన్‌ స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌ (NSAID) వలన లివర్ పనితీరు దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. నిమెసులైడ్‌ను రోజులో 100 ఎంజీ కంటే లివర్ పూర్తిగా పాడైపోతుందని తేలింది. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున.. జాతీయ ఆరోగ్య భద్రతా చట్టం ప్రకారం దీనిపై తక్షణ నిషేదం పడింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ పెయిన్‌ కిల్లర్‌ బ్రాండ్లను తయారుచేసే ఫార్మా కంపెనీలకు గట్టి దెబ్బతగిలింది. వెంటనే తమ ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా బయట మార్కెట్లోకి ఇప్పటికే పంపిన మాత్రలను వెంటేనే తయారీ సంస్థలు రిటర్న్ చేసుకోవాలని పేర్కొంది. గతంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇలా హై డోస్ ఉన్న మెడిసిన్స్ ను, డ్రగ్స్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిమెసులైడ్‌ అధిక డోసు ఉంటే అది పూర్తిగా బ్యాన్ అవుతుంది. తక్కువ డోసు ఫార్ములా ఉన్న నిమెసులైడ్‌ ఎప్పటిలాగే మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.