తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే

ఫ్రికాలో 500 సంవత్సరాల పురాతన ఓడ ఏడారిలో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యింది. అయితే సముద్ర గర్భంలో ఉండాల్సిన నౌక ఇంత భారీ పరిమాణం గల నౌక ఇసుక ఏడారిలోకి ఎలా వచ్చిందబ్బా అని వారు తొలుత హవాక్కయ్యారు.


తాజాగా అందులో అపారమైన బంగారం. వెండితో పాటు పెద్ద మెుత్తంలో ఖజానా దొరికింది.

2008 సంవత్సరంలో ఆఫ్రికాలోని నమీబియాలో నమీబ్ ఏడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనే నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో దాదాపు 2వేల బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోగ్రాములు రాగి కడ్డీలు ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు.

అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్‌కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమిబీయా తీరాన్ని తీవ్ర మంచుతుపాను తాకడంతో ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడ లభ్యం కాలేదు ఈ విషయం వారికి ఇప్పటికీ రహస్యంగానే ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.