గుమ్మడి గింజలతో ఎన్ని లాభాలో తెలుసా? తినకుంటే మీకే నష్టం

నేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గుమ్మడికాయ గింజలను ఆహారంలో తీసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇందుకు.. గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే చాలా ఆరోగ్య ప్రయోజనాలు తెలియకపోవడమే కారణం.


చియా సీడ్స్, అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, సీతాఫలం గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాల కంటే కూడా గుమ్మడి గింజలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి శక్తినివ్వడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేస్తాయి.

గుమ్మడి గింజలు తినడం వల్ల లాభాలు

గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే లాభాల గురించి చాలా మంది వైద్య నిపుణులు వివరించారు. వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఉదయంపూట గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక శక్తి లభిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేగాక, గుమ్మడి గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జీర్ణక్రియను మెరుగుస్తాయి.

నియంత్రణలో శరీర బరువు

గుమ్మడికాయ గింజలు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి సహకరిస్తుంది. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల పొట్ట నిండినట్లుగా అనుభూతి చెందడంతో ఆకలి తగ్గుతుంది. వాటిలోని ఫైబర్ జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఈ గింజల్లోని నీటి శాతం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

కంట్రోల్‌లో బీపీ

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ గుమ్మడి గింజలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

షుగర్ లెవల్స్ కంట్రోల్

గుమ్మడి గింజలను తరచూ తీసుకోవడం వల్ల మధుమేహం(డయాబెటిస్) నియంత్రణలో ఉంటుంది. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తంలోని చెక్కరను కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ గింజలను తింటే.. వారిలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి.

గుమ్మడి గింజలతో కిడ్నీ సమస్యలకు చెక్

గుమ్మడికాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్ర నాళాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు. వీటిలో ఉండే పోషకాలు, సహజ సమ్మేళనాలు.. మూత్రాశయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలు తరచూ తీసుకుంటే కిడ్నీ సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.