అడిగిన ధరకే టాటా కార్లను ఇచ్చేస్తున్న షోరూం యజమానులు..సగం ధరకే నెక్సాన్, కర్వ్, పంచ్

టాటా కార్ల ప్రేమికులకు ఇది అదిరిపోయే శుభవార్త. మధ్యతరగతి సామాన్యుడికి సొంత కారు కల ఇప్పుడు చాలా సులభంగా నెరవేరబోతోంది. ప్రముఖ టాటా మోటార్స్ డీలర్ షిప్ నెట్‌వర్క్ అయిన జాస్పేర్ మోటార్స్(Jasper Motors) తమ వద్ద ఉన్న టెస్ట్ డ్రైవ్ వాహనాలను (Demo Cars) భారీ తగ్గింపు ధరలతో విక్రయానికి ఉంచింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ షోరూమ్‌లలో దాదాపు అన్ని మోడళ్లపై 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

సాధారణంగా షోరూమ్‌కి వెళ్లినప్పుడు కస్టమర్లు టెస్ట్ డ్రైవ్ చేయడానికి లేదా షోరూమ్ లో ప్రదర్శనకు ఉంచే వాహనాలను డెమో కార్లు అంటారు. ఇవి కేవలం కొన్ని వందల లేదా వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగి ఉంటాయి. షోరూమ్ సిబ్బంది వీటిని ఎప్పుడూ నీట్‌గా, కొత్త కార్లలాగే మెయింటైన్ చేస్తారు. కంపెనీ కొత్త మోడళ్లను లాంచ్ చేసినప్పుడు, పాత డెమో స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఇలా భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది. వీటిని కొనడం వల్ల కస్టమర్లకు కొత్త కారు ఫీలింగ్ రావడమే కాకుండా లక్షల రూపాయల ఆదా అవుతుంది.

జాస్పేర్ మోటార్స్ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లపై భారీగా తగ్గింపులు ఉన్నాయి. టాటా కర్వ్ EV (Empowered+ A 55) అసలు ధర సుమారు రూ.24.10 లక్షలు కాగా, ఇప్పుడు అది కేవలం రూ.14 లక్షలకే లభిస్తోంది. అంటే ఏకంగా రూ.10.10 లక్షల ఆదా అన్నమాట. అలాగే టాటా నెక్సాన్ ఫీర్లెస్ వేరియంట్ రూ.16.40 లక్షల నుంచి రూ.10 లక్షలకు తగ్గింది. ఈ ఆఫర్ వల్ల మధ్యతరగతి వారు కూడా ప్రీమియం ఎస్‌యూవీలను అందుబాటు ధరలో కొనే అవకాశం కలిగింది.

డీజిల్ మరియు పెట్రోల్ కార్ల విషయానికొస్తే.. టాటా కర్వ్ డీజిల్ మోడల్ రూ.21.65 లక్షల నుంచి రూ.13 లక్షలకు, ఆల్ట్రోజ్ డీజిల్ రూ.11.10 లక్షల నుంచి కేవలం రూ.6 లక్షలకే అందుబాటులో ఉంది. టాటా పంచ్ ఈవీ ధర రూ.11.60 లక్షల నుంచి రూ.10 లక్షలకు తగ్గింది. ఇక అత్యంత తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారి కోసం టియాగో ఈవీని రూ.11.80 లక్షల నుంచి కేవలం రూ.5.80 లక్షలకే జాస్పేర్ మోటార్స్ అందిస్తోంది. అంటే దాదాపు సగం ధరకే బ్రాండ్ న్యూ కారు మీ ఇంటికి రాబోతోంది.

డెమో కార్లు కొనడం వల్ల కస్టమర్లకు అనేక లాభాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఈ కార్లు ఇంకా రిజిస్టర్ అయి ఉండవు కాబట్టి, వీటిని కొన్నవారే మొదటి యజమాని అవుతారు. దీనివల్ల భవిష్యత్తులో రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది. అంతేకాకుండా, ఇవి సాధారణంగా టాప్-ఎండ్ మోడల్స్ కావడం వల్ల తక్కువ ధరకే సన్‌రూఫ్, ఏడీఏఎస్ (ADAS) వంటి అన్ని ఫ్యాన్సీ ఫీచర్లు లభిస్తాయి. వెయిటింగ్ పీరియడ్ లేకుండా వెంటనే డెలివరీ పొందవచ్చు.

అయితే ఈ కార్లు కొనడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డెమో కార్లు కాబట్టి కారు కండిషన్, టైర్లు, పెయింట్ ఫినిషింగ్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి మెకానిక్ తో చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే సర్వీస్ హిస్టరీని అడిగి తెలుసుకోవాలి. జాస్పేర్ మోటార్స్ విజయవాడ, గుంటూరు, భీమవరం, విశాఖపట్నం వంటి నగరాల్లో తన సేవలను అందిస్తోంది. స్టాక్ పరిమితంగా ఉన్నందున ఆసక్తి ఉన్నవారు త్వరగా స్పందించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.