ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, లివర్ సమస్య ఉన్నట్లే

యసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని వేధిస్తున్న అనారోగ్య సమస్య ఫ్యాటీ లివర్. ఒక్కప్పుడు మద్యం ఎక్కువగా తీసుకునే వారిలో మాత్రమే ఈ సమస్య ఉండేది.


కానీ ఇప్పుడు మద్యం తాగని వారిలో కూడా మనం ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు కారణంగా మారుతున్నాయి. ఇది శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించడంతో పాటు దీని లక్షణాలను ముందుగా గుర్తించడం కూడా చాలా అవసరం.

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో లక్షణాలు ప్రారంభ దశలో కీలకం. ఈ సమస్యతో బాధపడే వారు ఊహించని విధంగా బరువు పెరుగుతారు. పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం అంతర్లీనంగా ఉన్న కాలేయ సమస్యలను కూడా సూచిస్తుంది. రక్తంలో పెరిగిన చక్కెరలు ఫ్యాటీ లివర్ సమస్యను కూడా సూచిస్తాయి. ఫ్యాటీ లివర్ జీవక్రియలను దెబ్బతీయడంతో పాటు కాలేయ పనితీరు మందగించేలా చేస్తుంది. దీంతో ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఎప్పుడూ నీరసంగా ఉండడం.. అలసట కూడా ఫ్యాటీ లివర్ కి ఒక సంకేతమే. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ పనితీరు తగ్గుతుంది. దీంతో ఎప్పుడు అలసటగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారిలో చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. కామెర్లు రావడాన్ని తీవ్రమైన ఫ్యాటీ లివర్ సమస్యగా భావించాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారిలో పొత్తికడుపు పైభాగంలో కుడివైపు నొప్పిగా ఉంటుంది. వాపు కారణంగా కాలేయ పరిమాణం పెరుగుతుంది. దీంతో కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఫ్యాటీ లివర్ సాధారణంగా శరీరంలో కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా కాలేయ పనితీరు తగ్గడంతో పాటు గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. మలం, మారిన మూత్రం రంగు కాలేయ అనారోగ్యాన్ని సూచిస్తాయి. బైలిరుబిన్ వల్ల మూత్రం ముదురు రంగులో వస్తుంది. రోజూ వ్యాయామం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, బరువు అదుపులో ఉంచుకోవడం వంటివి చేయాలి. ఆరోగ్యకర మైన కొవ్వులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను, లీన్ ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను, చక్కెరలను తక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని తాగడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడి వ్యర్థాలు బయటకు పోతాయి. మద్యం సేవించడం మానేయాలి. మంచి జీవనశైలిని అలవరుచుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.