Electoral bonds: ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి..?

www.mannamweb.com


Electoral Bond Scheme: ఇంతకీ, ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్ మాత్రమే..
భారత్ కు చెందిన వ్యక్తులు, సంస్థలు, సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగించవచ్చు అన్నమాట. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్ లో మొదటి సారి ప్రవేశ పెట్టారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒక ఆర్థిక పరికరంగా పని చేస్తుంది. అయితే, ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఇక, ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజులలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది.
కాగా, ఎలక్టోరల్ బాండ్లను 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, లక్ష రూపాయలు, కోటి రూపాయల వరకు గుణిజాలలో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక, ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ బాండ్స్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందించాల్సి ఉంటుంది. కాగా, రాజకీయ పార్టీలు ఈ బాండ్‌ను బ్యాంకులో ధృవీకరించబడిన ఖాతా ద్వారా మాత్రమే నగదు చేస్తుంది. అయితే, బాండ్స్ పై దాత పేరు ఉండదు దాని వివరాలు బ్యాంకు దగ్గర గోప్యంగా ఉంటాయి.