అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16న ప్రారంభం కానున్నది. స్మార్ట్ ఫోన్లపై బ్లాక్ బస్టర్ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 12GB RAM కలిగిన పవర్ ఫుల్ సామ్ సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై క్రేజీ ఆఫర్ ఉంది.
గత సంవత్సరం ప్రారంభించిన ఈ మీడియం రేంజ్ హ్యాండ్ సెట్ దాని అసలు లాంచ్ ధరలో దాదాపు సగం ధరకే లభిస్తుంది. రూ.42,999 ధర ఉన్న ఈ ఫోన్ 42 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 కే వచ్చేస్తోంది. ఈ సేల్ టైమ్ లో లైవ్‌లో ఉండే వివిధ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అమెజాన్ వివరించింది.
Samsung Galaxy A55 5G మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది
8 జీబీ ర్యామ్ + 128 జీబీ
8 జీబీ ర్యామ్ + 256 జీబీ
12 జీబీ ర్యామ్ + 256 జీబీ
Galaxy A55 5G MRP రూ.42,999 నుండి ప్రారంభమవుతుండగా, ఇది అమెజాన్‌లో రూ.24,999 ప్రమోషనల్ ప్రారంభ ధరకు లిస్ట్ అయ్యింది. అదనంగా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో, ప్రారంభ ధర కేవలం రూ.23,999కి తగ్గుతుంది.
Samsung Galaxy A55 5G కీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. విజన్ బూస్టర్ టెక్నాలజీని, సురక్షితమైన ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఇది Exynos 1480 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది, 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది 25W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ UI 8పై రన్ అవుతుంది. గెలాక్సీ A55 5G వెనుక భాగంలో వెర్సటైల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో కెమెరా, హై క్వాలిటీ వీడియో కాల్స్, సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం, 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

































