Can I eat meat and go to the temple? Do you know what will happen if you go?
మాంసాహారం తిని గుడికి వెళ్ళవచ్చా? వెళ్తే ఏమవుతుందో తెలుసా..?
మన దేశంలో ఉన్న హిందూ పురాణాల ప్రకారం చూస్తే.. కొన్ని ఆచారాలను మనం తప్పకుండా పాటించాల్సిందే. అంతేకాకుండా.. మన దేశం నిర్మితమైందే సంస్కృతి, సాంప్రదాయం అనే పునాదుల పైనే అనే విషయం మనందరికీ తెలిసిందే.
అయితే హిందూ సంప్రదాయంలో.. ఎవరు కూడా మాంసం తిని దైవ దర్శనానికి గుడికి వెళ్ళకూడదు అని అందరికి తెలిసిన విషయమే.. కాకపోయే మాంసం తిని ఎందుకు వెళ్ళకూడదో మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
దీనిని గురించి పది మందికి తెలియజెప్పాలని చేసే మా ఈ ప్రయత్నమే ఈ వ్యాసం. మాంసం తీసుకుని గుడికి వెళ్తే వికార కోరికలు పుడతాయట. మాంసం కామ వికార కోరికలను ఉత్పన్నం చేస్తాయట. మాంసాహారాన్ని స్వీకరిస్తే.. సత్వగుణం తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం తిని దైవ పూజ చేస్తే.. ఆ పూజ ఫలించక పోగా, కీడు జరుగుతుందని శాస్త్రాల్లో ఉన్నట్లు పెద్దలు చెబుతూ ఉంటారు.
అందుకే కాబోలు మాంసాహారం తిన్న రోజున ఎవరూ పూజ చెయ్యరు. మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది. పోచమ్మ, సమ్మక్క, సారక్క, బడ్డి పోచమ్మ, ఎల్లమ్మ ఇలా కొందరు దేవతకు మాత్రమే మాంసాహారం ప్రసాదంగా పెడతారు.