ఆర్మీ డే సందర్భంగా సైనికులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులను, వారి త్యాగాలను ప్రశంసిస్తూ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.
‘భారత సైన్యం ధైర్యసాహసాలకు, అచంచలమైన కర్తవ్య నిష్ఠకు ఆర్మీ డే సందర్భంగా ఘనంగా సెల్యూట్ చేస్తున్నాం. దేశ రక్షణ కోసం అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ నిస్వార్థ సేవ చేసే సైనికులు భారత గౌరవానికి ప్రతీకలు. వారి అంకితభావం దేశ ప్రజలందరిలో విశ్వాసం, కృతజ్ఞతను నింపుతోంది. విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర జవాన్లను మనస్పూర్తిగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం’ అని ప్రధాని ట్వీట్ చేశారు (PM Modi wishes to Indian Army).
కాగా, రాజస్థాన్‌లోని జైపూర్‌లో 78వ ఆర్మీ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి (Army Day 2026). రోబో డాగ్స్ సహా యుద్ధ విమానాలు, క్షిపణులను ఈ పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్షన్నర మంది హాజరుకాబోతున్నట్టు సమాచారం. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే ఆర్మీ డే పరేడ్ జరిగేది. అయితే 2023 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు.




































