ఆ మహిళ 10,000 యువాన్లను క్లెయిమ్ చేసింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఓ అమ్మాయి 2015లో తన కాలేజీలో చదువుతున్న ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ సమయంలో చైనా లైఫ్ ప్రాపర్టీ అండ్ క్యాజువాలిటీ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ ప్రేమ బీమా పాలసీని అందించింది. ఆ పాలసీని 299 యువాన్లకు (రూ. 3,900) అమ్ముతున్నారు. ఆ పాలసీని 199 యువాన్లకు తీసుకుంది. దానిని తన ప్రియుడికి బహుమతిగా ఇచ్చింది.
వివాహంలో ముగిసే ప్రేమకథలు చాలా అరుదు. అందుకే, ఒక బీమా కంపెనీ దీన్ని మూలధనంగా చేసుకుని ప్రేమ బీమా పాలసీని అందించింది. పాలసీ ప్రారంభించిన తేదీ నుండి మూడవ వార్షికోత్సవం తర్వాత 10 సంవత్సరాలలోపు ప్రేమికుడు వివాహం చేసుకుంటే, వారు 10,000 గులాబీలు ఇస్తామని కంపెనీ ఆఫర్ చేసింది. లేదా వారు 0.5 క్యారెట్ డైమండ్ రింగ్ ఇస్తారు. లేదా వారు 10,000 యువాన్లను నగదుగా ఇస్తారు.
ఆమె తన ప్రేమికుడికి అలాంటి పాలసీ ఇచ్చినప్పుడు ప్రేమికుడు షాక్ అయ్యింది. “ఆమె ప్రేమ బీమా కొన్నానని నాకు చెప్పినప్పుడు, ఎవరో ఆమెకు టోపీ పెట్టారని నేను అనుకున్నాను” అని ఇప్పుడు ఆమెను వివాహం చేసుకున్న ప్రేమికుడు చెప్పాడు.
ఇద్దరూ 2015 లో డేటింగ్ ప్రారంభించారు. వారు అక్టోబర్ 2025లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత, వారు బీమా డబ్బును క్లెయిమ్ చేసుకున్నారు. వారు 10,000 గులాబీలు కోరుకోలేదు. అలాగే వజ్రపు ఉంగరం కోరుకోలేదు 10,000 యువాన్లు (రూ. 1.2 లక్షలు) చైనా కంపెనీ 2017 లో ఈ ప్రేమ బీమా పాలసీ పథకాన్ని నిలిపివేసింది. అప్పటి వరకు చేసిన పాలసీలు యాక్టివ్గా ఉంటాయని చెబుతున్నారు.
































