గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు (Egg Prices) భారీగా పెరిగి సామాన్య ప్రజలను షాక్ఇచ్చాయి.. ముఖ్యంగా కోడిగుడ్డు ధర ఒక్కసారిగా రూ.
8కు చేరడంతో, నిత్యావసరంగా గుడ్లు వినియోగించే కుటుంబాల పై భారం పడింది..ఈ క్రమంలో సంక్రాంతి వేళ కోడిగుడ్ల ధర ఒక్కసారిగా దిగిరావడం ప్రజలకు ఊరట కలిగిస్తోంది. నిన్నటి వరకు రూ. 8 పలికిన కోడిగుడ్డు ధర, రెండు రూపాయలు తగ్గి రూ. 6కి చేరింది. ధర (Egg Prices) దిగి రావడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా, పౌల్ట్రీ యజమానులు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
పెరిగిన ధరలు మరికొన్నాళ్ల పాటు ఉంటే లాభాలు వచ్చేవని వారు చెబుతున్నారు.తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత నెలలో రికార్డు స్థాయికి చేరిన ధర, ఇప్పుడు గణనీయంగా తగ్గడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వంద గుడ్ల హోల్ సేల్ ధర రూ. 775 నుంచి రూ. 575కి పడిపోయింది. రిటైల్ ధర విషయానికి వస్తే ఒక్కో గుడ్డు మీద రూ. 2 తగ్గడంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పౌల్ట్రీ యజమానుల ఆశలు అడియాశలయ్యాయి.

































