ప్రాపర్టీ డాక్యుమెంట్స్ (Property documents) కీలకం
మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు, బ్యాంకులు మీ ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, సేల్ డీడ్, టైటిల్ డీడ్‌ను తీసుకుంటాయి. ఈ డాక్యుమెంట్స్ చాలా కీలకమైనవి. హోమ్ లోన్‌ని కంప్లీట్‌గా పే చేసేసిన తర్వాత బ్యాంకులు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని కస్టమర్‌కి తిరిగి అప్పగించాలి.
అయితే, చాలా మంది కస్టమర్లకు డాక్యుమెంట్స్ టైమ్‌కి చేతికి అందడం లేదు. చాలా ఆలస్యం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో, బ్యాంకులు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా నెలలు లేదా సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నాయి. కస్టమర్లు డాక్యుమెంట్స్ భద్రతపై ఆందోళన, ఒత్తిడి కలిగిస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడానికి, రిజర్వ్ బ్యాంక్ స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేసింది. లోన్ పూర్తిగా చెల్లించిన 30 రోజుల్లోపు బ్యాంకులు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కచ్చితంగా అందజేయాలి. ఏదైనా బ్యాంకు ఈ రూల్ ఫాలో కాకపోతే, ఆలస్యం అయిన ప్రతి రోజుకు రూ.5,000 చొప్పున పెనాల్టీ భరించాలి. ఈ నియమం 2023 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ రూల్‌ని హైలైట్ చేయడానికి ఒక కంటెంట్ క్రియేటర్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఆమె తన హోమ్ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత కూడా, బ్యాంకు తన డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వడానికి 130 రోజులు ఆలస్యం చేసిందని ఆమె పేర్కొంది.
మీ బ్యాంక్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ సకాలంలో తిరిగి ఇవ్వకపోతే బ్యాంకుకు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయండి. సమస్యను బ్యాంకు ఫిర్యాదుల పరిష్కార విభాగానికి తెలియజేయండి. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే RBI బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించండి.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకున్నారు.
డాక్యుమెంట్స్ పోతే, దెబ్బతింటే ఎలా?
RBI రూల్స్ ప్రకారం, మీ డాక్యుమెంట్స్ సురక్షితంగా ఉంచడానికి బ్యాంకులు పూర్తిగా బాధ్యత వహిస్తాయి. ఏదైనా ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్ పోయినా లేదా దెబ్బతిన్నా బ్యాంకు తప్పనిసరిగా, అవి తిరిగి పొందడంలో మీకు సహాయం చేయాలి. ఉన్న అన్ని ఖర్చులు భరించాలి.



































