నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సువర్ణావకాశం అందిస్తుంది. 2026 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ అవకాశాలతో యువ గ్రాడ్యుయేట్లకు బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టే మంచి అవకాశం లభించనుంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 11 పోస్టులు, తెలంగాణలో 17 పోస్టులు కేటాయించారు.
ఈ ఉద్యోగాలకు ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరగడం వల్ల గ్రాడ్యుయేట్లకు ఇది ఆకర్షణీయమైన నోటిఫికేషన్‌గా మారింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత పని అనుభవం తప్పనిసరిగా పేర్కొన్నారు. దీని గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
వయోపరిమితి & సడలింపులు..
అభ్యర్థుల వయస్సు కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లు మధ్య ఉండాలి.
సడలింపులు ఇలా ఉన్నాయి:
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
- పీడబ్ల్యూబీడీ (దివ్యాంగులు) – గరిష్టంగా 10 సంవత్సరాలు
వయోసడలింపు ఇతర ప్రభుత్వ నిబంధనలకు లోబడి వర్తిస్తుంది.
ఎంపిక విధానం..
- ఈ అప్రెంటిస్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు.
- అభ్యర్థుల ఎంపిక విద్యార్హతల ఆధారంగా రూపొందించే మెరిట్ లిస్ట్ ప్రకారమే జరుగుతుంది. దీంతో పరీక్ష భయం లేకుండా అర్హత కలిగిన వారికి అవకాశాలు పెరుగుతాయి.
స్టైపెండ్ & శిక్షణ కాలం..
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు ₹12,300 స్టైపెండ్ అందజేస్తారు. ఈ అప్రెంటిస్‌షిప్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రాక్టికల్ అవగాహన లభించడంతో పాటు భవిష్యత్తు బ్యాంక్ ఉద్యోగాలకు ఇది మంచి అనుభవంగా ఉపయోగపడుతుంది.
దరఖాస్తు విధానం & తేదీలు..
అర్హత గల అభ్యర్థులు 2026 జనవరి 15 నుంచి జనవరి 25 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, రాష్ట్రాల వారీ ఖాళీలు, ఇతర నిబంధనలను పరిశీలించాలని బ్యాంక్ సూచించింది.



































